Home > జాతీయం > Mallikarjun Kharge : ఏం జరుగుతుందో చూద్దాం.. బిహార్ రాజకీయాలపై ఖర్గే

Mallikarjun Kharge : ఏం జరుగుతుందో చూద్దాం.. బిహార్ రాజకీయాలపై ఖర్గే

Mallikarjun Kharge : ఏం జరుగుతుందో చూద్దాం.. బిహార్ రాజకీయాలపై ఖర్గే
X

బిహార్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరగుతున్నాయి. సీఎం నితీష్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని వీడి బీజేపీకి దగ్గరవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. బీజేపీతో జతకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ ఫోన్ చేసిన నితీష్ స్పందించలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నితీష్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు తనకు తెలియదన్నారు. ఇండియా కూటమిలో జేడీయూ బలమైన పార్టీ అని చెప్పారు.

నితీష్ మనసులో ఏముందో..

నితీష్ మనసులో ఏముందో తెలియడం లేదని ఖర్గే అన్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారంపై ఆయనకు లేఖ రాసినట్లు వివరించారు. ఫోన్ లో మాట్లాడేందుకు ప్రయత్నించిన కుదరలేదని చెప్పారు. బిహార్ రాజకీయాలపై స్పష్టత వచ్చాక మాట్లాడతానని తెలిపారు. ఇవాళ లేదా రేపు నితీష్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. బీజేపీతో కలిసి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. అటు ఆర్జేడీ సైతం అధికారం కోసం పావులు కదుపుతోంది. దీంతో అక్కడి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

బీజేపీ అలర్ట్..

మరోవైపు బిహార్ రాజకీయాలతో బీజేపీ అలర్ట్ అయ్యింది. అమిత్ షా అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పర్యటనను సైతం క్యాన్సిల్ చేసుకున్నారు. ఏ క్షణాన్న ఎటువంటి నిర్ణయమైన తీసుకునేందుకు ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ తో షా భేటీ అయ్యారు. బీహార్‌లో తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. జేడీయూతో మళ్లీ కలవడం వల్ల వచ్చే లాభనష్టాలు, ఆ పార్టీ వెంట వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ప్రభుత్వంలో భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించారు.

ఇండియా కూటమికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మమతా బెంగాల్ లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించగా.. ఇప్పుడు నితీష్ సైతం దూరమవుతున్నారు. ఇండియా కూటమి ఏర్పాటులో నితీష్ కీలకంగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిమాణాలపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. కమిటీ కన్వీనర్ లేదా ప్రధాని అభ్యర్థి స్థానాన్ని నితీష్ ఆశించారు. కానీ కాంగ్రెస్ ఆ రెండిటిని ఆయనకు దక్కకుండా చేసింది. మరికొన్ని రోజుల్లో రాహుల్ యాత్ర బిహార్లోకి ప్రవేశించనుంది. అయితే ఆ యాత్రకు దూరంగా ఉంటానని నితీష్ ప్రకటించారు.


Updated : 27 Jan 2024 6:16 PM IST
Tags:    
Next Story
Share it
Top