Home > జాతీయం > Mamata Banerjee : విపక్షాల కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జి

Mamata Banerjee : విపక్షాల కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జి

Mamata Banerjee : విపక్షాల కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జి
X

ఇండియా కూటమిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. బెంగాల్‌లో సీట్ల షేరింగ్‌పై విపక్షాల కూటమిలో మాటల తూటాలు పేలుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ మధ్య అంతర్గత పోరు నడుస్తున్న వేళ సీఎం మమతా బహిరంగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు తగిన సీట్లు కేటాయించకపోతే రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె హెచ్చరించారు. ముర్షిదాబాద్ జిల్లా సంస్థాగత సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల సమరానికి కార్యకర్తలు ఎన్నికల సిద్ధం కావాలని ఆమె సూచించించారు. అయితే మైనారిటీ జనాభా అత్యధికంగా ఉన్న ముర్షిదాబాద్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. జిల్లాలోని 3 లోక్‌సభ స్థానాల్లో పార్టీ విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు. బెంగాల్‌లో తమను కాదని ఆర్‌ఎస్‌పీ, సీపీఐ, సీపీఎంలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే తాము తమ మార్గాన్ని చూసుకోవాల్సి ఉంటుందన్నారు.

42 స్థానాల్లో పోరాడి గెలవడానికి సన్నాహాలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా 28 పార్టీలతో కూడిన విపక్ష ఇండియా కూటమికి సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, కాంగ్రెస్, సీపీఐ(ఎం) ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. అయితే సీట్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్, తృణమూల్ మధ్య సయోధ్య కుదరడం లేదు. ఇరు పార్టీలకు చెందిన నేతలు బహిరంగంగా పరస్పర విమర్శలకు దిగుతున్నారు. ఇండియా కూటమీ’ లో భాగస్వామ్య పార్టీ అయిన టీఎంసీ.. మొదటి నుంచి పశ్చిమ బెంగాల్‌లో సీట్ల పంపిణీ విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి రెండు సీట్లను ఇవ్వడానికి సిద్ధమని పేర్కొంది. అయితే అనూహ్యంగా అన్ని స్థానాల్లో(42) టీఎంసీ తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎంసీ తీసుకోబోయే నిర్ణయంపై కాంగ్రెస్‌, ‘ఇండియా కూటమి’లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక.. 2019పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఎంసీ 22, బీజేపీ18, కాంగ్రెస్‌ పార్టీ 2 సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే.




Updated : 20 Jan 2024 11:38 AM IST
Tags:    
Next Story
Share it
Top