Home > జాతీయం > రాహుల్ గాంధీ నా ఫెవరెట్ లీడర్ : మమతా

రాహుల్ గాంధీ నా ఫెవరెట్ లీడర్ : మమతా

రాహుల్ గాంధీ నా ఫెవరెట్ లీడర్ : మమతా
X

వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యూహ రచనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా నిన్న, ఇవాళ బెంగళూరులో ప్రత్యేక సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి 26 పార్టీలు హాజరై బీజేపీని మట్టికరిపించే అంశాలపై మంతనాలు జరిపాయి. విపక్షాల కూటమికి కొత్తగా ఇండియా అనే పేరును కూడా పెట్టారు. ఈ సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్డీఏ, బీజేపీకి ఇండియా కూటమిని ఎదుర్కొనే సత్తా ఉందా అని మమతా ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న ఆమె.. ఎన్డీఏని ఓడించేందుకు విపక్ష పార్టీల నేతలమంతా కలిసికట్టుగా పోరాడుతామని చెప్పారు. తమ కూటమిని బీజేపీ ఎదుర్కోగలదా..? అని సవాల్ విసిరారు. బీజేపీ, ఎన్దీఏ దేశ ప్రజల మధ్య విద్వేషాలను సృష్టిస్తున్నాయని ఆరోపించారు.

ఇక రాహుల్ గాంధీపై మమతా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తన ఫేవరెట్ లీడర్ అని చెప్పారు. బీజేపీపై రాహుల్ గాంధీ బలంగా పోరాడుతున్నారని ప్రశంసించారు. ఇండియా కూటమి విజయం సాధించడంతో దేశం గెలుస్తుందన్నారు. ఇకపై తమ ప్రచారం, పోరాటం అంతా ఇండియా పేరు మీదే ఉంటుందని.. తాము దేశం కోసం కలిశామని స్పష్టం చేశారు.


Updated : 18 July 2023 7:14 PM IST
Tags:    
Next Story
Share it
Top