Home > జాతీయం > ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడి చంఢాలం

ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడి చంఢాలం

సీటులోనే అన్నీ కానిచ్చాడు

ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడి చంఢాలం
X


ఎయిర్ ఇండియా విమానంలో మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి.. బిజినెస్ క్లాస్​ సీటులో కూర్చున్న ఓ వృద్ధురాలిపై మూత్రం పోశాడు. ఈ ఘటన అప్పట్లో పెద్ద దూమారం రేపింది. తాజాగా ముంబయి నుంచి ఢిల్లీ వెళ్తున్న AIC 866 విమానంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. సీటులోనే మల, మూత్ర విసర్జన చేశాడు. అనంతరం అక్కడే ఉమ్మివేశాడు.

ఆ గలీజ్ పనిని గమనించిన క్యాబిన్​ సిబ్బంది.. అతడిని హెచ్చరించారు. తోటి ప్రయాణికులు కూడా.. కస్సుబుస్సుమన్నారు. ఈ ఘటనపై విమాన సిబ్బంది.. ఢిల్లీ ఎయిర్​పోర్టు అధికారులకు సమాచారం అందించారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండ్​ అయిన తర్వాత అక్కడి భద్రతా సిబ్బంది.. నిందితుడిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) పోలీస్​ స్టేషన్​కు తరలించారు. విచారణలో నిందితుడు ఆఫ్రికాలో కుక్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. ఈ ఘటన జూన్​ 24న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 'ఎయిర్​ ఇండియా సిబ్బంది ఫిర్యాదు చేయడం వల్ల నిందితుడిని అరెస్టు చేశాం. అనంతరం కోర్టులో హాజరు పరిచాం. కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ జరుగుతోంది' పోలీసులు తెలిపారు.

గతంలో ఎయిర్ ఇండియా విమానంలోనే జరిగిన ఇలాంటి ఘటనలో ఎయిర్ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది డీజీసీఏ. దీంతో పాటు ఆ విమాన పైలట్​ లైసెన్సును 3 నెలలపాటు సస్పెండ్ చేసింది. తన విధులు సరిగ్గా నిర్వర్తించనందుకు గాను ఎయిర్​ ఇండియా ఇన్​ఫ్లైట్ సర్వీసెస్ డైరెక్టర్​కు రూ.3లక్షల ఫైన్​ వేసింది. మళ్లీ ఇప్పుడేం యాక్షన్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.




Updated : 27 Jun 2023 8:12 AM IST
Tags:    
Next Story
Share it
Top