Home > జాతీయం > ఎమ్మెల్యే అభ్యర్థి ఓవరాక్షన్.. ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ మిస్

ఎమ్మెల్యే అభ్యర్థి ఓవరాక్షన్.. ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ మిస్

ఎమ్మెల్యే అభ్యర్థి ఓవరాక్షన్.. ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ మిస్
X

అసెంబ్లీ ఎన్నికల వేళ నామినేషన్ వేసేందుకు వెళ్లిన ఓ ఎమ్మెల్యే అభ్యర్థికి చేదు అనుభవం ఎదురైంది. నామినేషన్ రుసుమును నోట్ల రూపంలో కాకుండా నాణేల రూపంలో ఇవ్వాలనుకొని.. మొత్తం రూ.10 వేల నాణేలతో ఎన్నికల కార్యాలయానికి వెళ్లాడు. అయితే అక్కడి అధికారులు చిల్లర తీసుకోమని... కేవలం 1000 రూపాయల వరకు మాత్రమే నాణేల రూపంలో తీసుకోవడానికి పర్మిషన్ ఉందని చెప్పడంతో షాకయ్యాడు. నామినేషన్ దాఖలు చేసేందుకు అదే ఆఖరి రోజు కావడంతో.. ఇక మరో దారి లేక ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అఖిల భారత ట్రాన్స్‌పోర్ట్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడైన గణేశ్ దాస్‌ మహంత్‌... చత్తీస్‌గఢ్‌లోని కోర్బా స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించాడు. అందుకోసం తుల్సీ నగర్‌ బస్తీలోని ఎన్నికల కార్యాలయానికి నామినేషన్‌ దాఖలు చేయడానికి వెళ్లారు. నామినేషన్‌ రుసుమైన 10 వేల రూపాయలను నాణేల రూపంలో సమర్పించారు. వాటిలో ఒక రూపాయి, రెండు, ఐదు రూపాయల నాణేలు ఉన్నాయి. వాటిని చూసిన అధికారి చిల్లరను తీసుకోవడానికి నిరాకరించారు. కేవలం 1000 రూపాయల వరకు మాత్రమే నాణేల రూపంలో తీసుకోవడానికి అనుమతి ఉందని అధికారులు అతడికి తెలిపారు. ఫలితంగా ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజున గణేశ్ దాస్‌ నామినేషన్‌ వేయలేక పోయారు. 4 సంవత్సరాలుగా డ్రైవర్‌ యూనియన్‌ సభ్యులు ఇస్తున్న వాటిని భద్రపరచడం ద్వారా ఈ నాణేలు లభించినట్లు అతను చెప్పారు.




Updated : 1 Nov 2023 8:10 AM IST
Tags:    
Next Story
Share it
Top