Home > జాతీయం > 20 రూపాయలకే కిలో టమాటాలు.. ఎక్కడంటే..?

20 రూపాయలకే కిలో టమాటాలు.. ఎక్కడంటే..?

20 రూపాయలకే కిలో టమాటాలు.. ఎక్కడంటే..?
X

టమాటాల ధరలు వింటే ప్రజల గుండెలు అదురుతున్నాయి. కేజీ టమాటా ధర కొన్ని చోట్లా 200 రూపాయలకు పైగా పలుకుతోంది. గతంలో కేజీలకు కేజీలు కొన్న జనం ఇప్పుడు పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఇంకా చాలామంది టమాటాలు కొనేందుకే వెనకడుగు వేస్తున్నారు. మెక్ డొనాల్డ్ వంటి సంస్థలు సైతం తమ మెనూ నుంచి టమాటాలు తొలగించినట్లు వార్తలు రావడం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. అయితే ఓ వ్యక్తి మాత్రం 20 రూపాయలకే కిలొ టమాటాలు అమ్మాడు.

తమిళనాడులోని కడలూరుకు చెందిన రాజేష్‌ అనే వ్యక్తి కొన్నేళ్లుగా కూరగాయల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. టమాటాల ధరలు భారీగా పెరగడంతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించాడు. తన షాప్ 4వ వార్షికోత్సవం సందర్భంగా పేదలకు సాయపడాలని నిర్ణయించుకున్నాడు. దీన్ని కోసం బెంగళూరు నుంచి కిలో రూ.60 చొప్పున 550 కిలోలు కొనుగోలు చేశాడు.

ఆ తర్వాత వాటిని తన షాపులో 20కే కిలో చొప్పున అమ్మాడు. నిమిషాల్లోనే టమాటాలన్నీ అయిపోయినట్లు రాజేష్ వివరించాడు. 2019 లో కూడా ఉల్లిగడ్డ ధరలు పెరిగినప్పుడు.. తాను 10 రూపాయలకే కిలో అమ్మినట్లు చెప్పారు. ‘‘ నేను షాప్ పెట్టిన 2019లో ఉల్లిగడ్డ ధరలు 100 రూపాయలు దాటాయి. అప్పుడు ఓపెనింగ్ ఆఫర్ పేరుతో కేజీ ఉల్లి 10 రూపాయలకే విక్రయించాం’’ అని వివరించాడు.


Updated : 9 July 2023 3:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top