మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా !
X
నిత్య ఘర్షణలతో మణిపూర్ రగులుతూనే ఉంది. మెయిటీ, కుకీ వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఈ ఘర్షణల్లో సుమారు 130 మంది మరణించారు. రోజురోజుకు శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయి. ఈ క్రమంలో అల్లర్లను అదుపుచేయడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం బీరెన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ ఆయన గవర్నర్ అనసూయ యూకీని కలవనున్నారు. ఆమెకు రాజీనామా పత్రాన్ని అందజేస్తారని సమాచారం. ఈ నెల 23న ఆయన అమిత్ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అల్లర్లు ఇప్పట్లో సద్ధుమణిగేలా కన్పించడం లేదు.
మణిపూర్ లోని మెయిటీలకు ఎస్టీ హోదాను నాగా, కుకీ సామాజిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇరు క్రమంలోనే ఇరువర్గాలకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మే3 నుంచి జరుగుతున్న ఈ ఆందోళనలు నేటికి చల్లారడం లేదు. నిత్య ఘర్షణలతో రాష్ట్రం మొత్తం అట్టుడుకుతోంది. ఈ క్రమంలో సీఎం రాజీనామా చేస్తున్నట్లు సమాచారం.