Home > జాతీయం > ఘోరం.. బీజేపీ మహిళా అభ్యర్థి బట్టలిప్పి.. నగ్నంగా నిలబెట్టారు

ఘోరం.. బీజేపీ మహిళా అభ్యర్థి బట్టలిప్పి.. నగ్నంగా నిలబెట్టారు

ఘోరం.. బీజేపీ మహిళా అభ్యర్థి బట్టలిప్పి.. నగ్నంగా నిలబెట్టారు
X

మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటన మరువకముందే.. వెస్ట్ బెంగాల్ లో మరో దారుణం వెలుగుచూసింది. హుగ్లీ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. హౌరా జిల్లా దక్షిన్ పంచ్లలో జూలై 8న పంచాయతీ ఎన్నికల సమయంలో టీఎంసీ కార్యకర్తలు ఈ చర్యకు పాల్పడ్డారని లాకెట్ ఛటర్జీ తెలిపారు. పోలింగ్ బూత్ లో ఓ మహిళా అభ్యర్థిని బట్టలిప్పి నగ్నంగా నిల్చోబెట్టారని ఆరోపించారు. తన ఛాతి, తలపై కర్రలతో కొట్టి.. పోలింగ్ బూత్ నుంచి బయటకు గెంటేశారని లాకెట్ వివరిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. టీఎంసీ కార్యకర్తలపై చర్యలు తీసుకోనున్నారు.


Updated : 21 July 2023 9:55 PM IST
Tags:    
Next Story
Share it
Top