Home > జాతీయం > మణిపూర్ వీడియో మీద ఈరోజు సుప్రీంకోర్టు సుమోటో విచారణ

మణిపూర్ వీడియో మీద ఈరోజు సుప్రీంకోర్టు సుమోటో విచారణ

మణిపూర్ వీడియో మీద ఈరోజు సుప్రీంకోర్టు సుమోటో విచారణ
X

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన వీడియోను సుమోటాగా స్వీకరించింది సుప్రీంకోర్ట్. సోషలం మీడియాలో వైరల్ అయిన వీడియోను పరిగనలోకి తీసుకుంది. జూలై 20న తేదీన జడ్జి డీవై చంద్రచూడ్ ధర్మాసనం తీవ్రస్థాయిలో అసంతృపత్తి వ్యక్తం చేసింది. కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలు సరిగ్గా యాక్షన్ తీసుకోలేదని అబిప్రాయం వ్యక్తం చేసింది. యావత్ దేశమే కాదు... ఈన్యాయస్థానాన్ని కూడా ఈ వీడడియో బాధించింది. మహిళల మీద హింస దృశ్యాలను సోషల్ మీడియాలో ప్రసారం చేయడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం చెప్పింది. ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే అని వ్యాఖ్యానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదని....వారు ఏమీ చర్యలు చేపట్టకపోతే సుప్రీంకోర్టే స్వయంగా రంగంలోకి దిగుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పుడే ప్రభుత్వాలు ఏం చేయాలో తెలియజేస్తూ ఈరోజు అంటే జులై 28కి విచారణను వాయిదా వేసింది. కాబట్టి ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు దీని మీద విచారణ చేయనుంది.

మరోవైపు నిన్న మణిపూర్ హింస మీద సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేసినట్లు సుప్రీం కి చెప్పిన కేంద్ర హోంశాఖ....ఈ కేసును ఆరు నెలల కాలపరిమితితో జరగాలని...అదీ మణిపూర్ బయటనే జరగాలని అఫిడవిట్లో కోరింది.

శాంతి భద్రతల అంశం...ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశమే అయినా కేంద్రం తమ వంతు న్యాయం చేసేందుకు కృషి చేస్తోందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా చెప్పారు. కేంద్రం ఎప్పటికప్పుడు కేసు పురోగతిని పర్యవేక్షిస్తుందని తెలియజేసింది. ఇప్పుడు ఈ అఫిడవిట్ మీద సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలా స్పందిస్తుందో తెలుస్తుంది.

Updated : 28 July 2023 9:14 AM IST
Tags:    
author-thhumb

Veerendra Prasad

వీరేందర్ మైక్ టీవీ వెబ్‌సైట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌(సబ్ ఎడిటర్)గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో(V6, T News) రాజకీయం, లైఫ్ స్టైల్, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.


Next Story
Share it
Top