Home > జాతీయం > మణిపూర్ కోసం ముగ్గురు మాజీ మహిళా జడ్జీలతో కమిటీ

మణిపూర్ కోసం ముగ్గురు మాజీ మహిళా జడ్జీలతో కమిటీ

మణిపూర్ కోసం ముగ్గురు మాజీ మహిళా జడ్జీలతో కమిటీ
X

మణిపూర్ అల్లర్లను విచారించడానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది.ముగ్గురు మాజీ మహిళా జడ్జీలతో ఓ కమిటీని ప్రతిపాదించింది. దాంతో పాటూ వివిధ రాష్ట్రాలకు చెందిన డీజీఐ ర్యాంక్ అధికారులతో కూడిన 42 సిట్ అధికారులు... సీబీఐ చేపట్టినవి కాకుండా మిగతా కేసులు విచారణ చేపడతారని తెలిపింది.





చట్టాల మీద నమ్మకాన్ని పెంచడానికి, మణిపూర్ లో అల్లర్లు, హింస మీద విచారణ చేపట్టడానికి ముగ్గురు మాజీ హైకోర్టు న్యాయమూర్తులతో కూడాని కమిటీని వేస్తామని చెప్పింది సుప్రీంకోర్టు. ఈ కమిటీ దర్యాప్తులను చేయడమే కాకుండా.. సహాయక చర్యలు, నివారణ చర్యలు లాంటి వాటిని కూడా పరిశీలిస్తుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. కమిటీలో జమ్ము కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, బాంబే హైకోర్టు మాజీ జడ్జి షాలినీ జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ ఆశా మీనన్ ఉన్నారు.





ఇక సిట్ బృందంలో 5 రాష్ట్రా లనుంచి డిప్యూటీ సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు 5 గురు ుంటారని, సీబీఐ దర్యాప్తును మాజీ ఐపీఎస్ అధికారి దత్తాత్రేయ పద్సల్గికర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్ట్ తెలిపింది. సీబీఐకి ట్రాన్స్ ఫర్ కాని కేసులను సిట్ లు విచారణ చేస్తాయి. ఒక్కో అధికారి 6 సిట్ లను చూసుకుంటారని చెప్పింది.





Updated : 7 Aug 2023 1:04 PM GMT
Tags:    
Next Story
Share it
Top