Home > జాతీయం > Bank Holidays : 2024లో బ్యాంకులకు సెలవులు.. మార్చిలో బ్యాంకులకు 14 రోజుల పాటు హాలీడేస్

Bank Holidays : 2024లో బ్యాంకులకు సెలవులు.. మార్చిలో బ్యాంకులకు 14 రోజుల పాటు హాలీడేస్

Bank Holidays : 2024లో బ్యాంకులకు సెలవులు.. మార్చిలో బ్యాంకులకు 14 రోజుల పాటు హాలీడేస్
X

మార్చినెలో 31 రోజుల్లో 14 రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి. మార్చిలో ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు మొత్తం 14 రోజులు బ్యాంకులకు హాలీడేస్ రానున్నాయి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆర్థిక లావాదేవీల నిర్వహణకు బ్యాంక్ ఖాతాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నా, కొన్ని సందర్భాల్లో ఖాతాదారులు బ్యాంకు శాఖలను సంప్రదించడం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో మార్చిలో 31 రోజుల్లో 14 రోజులు బ్యాంకులకు సెలవు. ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతోపాటు మరో ఏడు రోజులు బ్యాంకులకు ఆర్బీఐ సెలవులు ప్రకటించింది.

నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం మార్చి 1,8,22,25,26,27, 29 తేదీల్లో బ్యాంకులకు సెలవులు. 3, 10, 17,24, 31 తేదీల్లో ఐదు ఆదివారాలు, 9,23 తేదీల్లో రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు దినాలు.బ్యాంక్ సెలవుల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంటుంది. ఇది అన్ని చోట్లా ఒకేలా ఉండవు. కొన్ని జాతీయ సెలవుల రోజు అన్ని బ్యాంకులకు సెలవు ఉండగా.. స్థానిక పండగల్ని బట్టి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇప్పుడు ఇలా మార్చిలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వీటిల్లో ప్రాంతీయ సెలవులు సహా రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో ఛాప్‌ఛర్ కుట్ సహా మహాశివరాత్రి, హోలీ, గుడ్‌ఫ్రైడే వంటి పండగలు ఉన్నాయి.

బ్యాంకులకు సెలవులు

మార్చి 1 – మిజోరంలో చాప్ చార్ కుట్ సందర్భంగా బ్యాంకులకు సెలవు

మార్చి 3- ఆదివారం

మార్చి 8 – మహా శివరాత్రి సందర్భంగా కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా సెలవు

మార్చి 9 – రెండో శనివారం

మార్చి 10- ఆదివారం

మార్చి 17 – ఆదివారం

మార్చి 22 – బీహార్ దివస్ సందర్భంగా బీహార్ లో బ్యాంకులు పని చేయవు.

మార్చి 23- నాలుగో శనివారం

మార్చి 25- హోలీ సందర్భంగా కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్, బీహార్, శ్రీనగర్ మినహా దేశమంతా సెలవు

మార్చి 26- హోలీ రెండో రోజు సందర్భంగా ఒడిశా, మణిపూర్, బీహార్ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు

మార్చి 27- హోలీ సందర్భంగా బీహార్ రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

మార్చి 20- గుడ్ ఫ్రైడే సందర్భంగా త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.






Updated : 26 Feb 2024 3:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top