Home > జాతీయం > తెలివి మీరిపోయిన దొంగలు

తెలివి మీరిపోయిన దొంగలు

తెలివి మీరిపోయిన దొంగలు
X

ముంబయ్ లో ఓ భారీ ఇనుప వంతెన సడెన్ గా మాయం అయిపోయింది. ఎలా అని ఆరా తీస్తే దాన్ని దొంగలు ఎత్తుకెళ్ళారని తెలిసింది. దొంగలు చేసిన ఈ పనికి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. ఇలా క్కూడా దొంగతనాలు చేస్తారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

మంబయ్ లోని మలాడ్ ప్రాంతంలో 90 అడుగుల పొడవైన 6వేల కేజీల ఇనుప వంతెన ఉండేది. అదానీ ఎలక్ట్రిక్ సంస్థకు చెందినదీ బ్రిడ్జి. ఎలక్ట్రిక్ కేబుళ్ళను తరలించడానికి తాత్కాలికంగా దీన్ని నిర్మించారు. ఆ తర్వాత అదే కాలువ మీద మరో వంతెన నిర్మించడంతో ఇనుప బ్రిడ్జిని ఉపయోగించడం మానేశారు. దీన్ని గమనించిన దొంగలు కామ్ గా తమ పని చేసుకుపోయారు.

మలాడ్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అలాంటి చోట ఉన్న వంతెన సడెన్ గా కినిపంచకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదానీ సంస్థ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు 4గురు దొంగలను పట్టుకుని విచారించారు. దర్యాప్తులో వాళ్ళు చెప్పిన విషయాలను విన్న పోలీసులు విస్తుపోయారు. గ్యాస్ కట్టర్లతో వంతెనను ముక్కలు గా చేసి, భారీ వాహనంలో తరలించినట్లు దొంగలు చెప్పారు. పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురులో ఒకరు ఆ వంతెనను నిర్మించినవాడే. ఈ నలుగురు కాకుండా ఈ దొంగతనం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Updated : 8 July 2023 6:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top