Home > జాతీయం > మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి
X

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం చికల్‌దరా ఘాట్‌ రోడ్డులో కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

కాగా మృతులు తెలంగాణలోని ఆదిలాబాద్‌, నల్లగొండ జిల్లాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ఇద్దరు ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి (టీ)కి చెందినట్లు తెలిపారు. బాధితుల్లో ఆరుగురు గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర పర్యటనకు వచ్చి ప్రమాదానికి గురయ్యారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Updated : 17 Sept 2023 2:44 PM IST
Tags:    
Next Story
Share it
Top