రెజ్లర్ల గురించి మీడియా ప్రశ్నలు .. కేంద్రమంత్రి పరుగో పరుగు
X
తమను లైంగిక వేధింపులకు గురిచేసిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. రెజ్లర్లు ఢిల్లీలో నెల రోజులుగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమ నిరసనను ఉధృతం చేస్తూ మంగళవారం తమ పతకాలను గంగలో నిమజ్జనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెడల్స్ ను నిమజ్జనం చేసేందుకు వెళ్లిన రెజ్లర్ల సమస్యపై మాట్లాడమని కోరిన మీడియాకు సమాధానం చెప్పకుండా పరుగెత్తారు కేంద్ర మంత్రి మీనాక్షి. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ట్విట్టర్ లో షేర్ చేయగా.. వీడియో వైరల్‌గా మారింది.
"మహిళా రెజ్లర్ల సమస్యపై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఘాటుగా స్పందించారు.. మీరే చూడండి.." అంటూ కాంగ్రెస్ ఈ వీడియోను షేర్ చేసింది. రెజ్లర్లు మంగళవారం హరిద్వార్‌కు వెళ్లే ముందు, మెడల్స్ ను నిమజ్జనం చేసేందుకు సిద్ధమయ్యారనే విషయంపై మంత్రిని వివరణ కోరగా.. విలేకర్లతో పరస్పర చర్చ జరిగింది. "నిరసన చేస్తున్న రెజ్లర్లకు మీరు ఏమి చెప్పదలుచుకున్నారు?" అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా... చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి మీనాక్షి తెలిపారు. ఇంతలోనే చలో చలో చలో అంటూ మంత్రి తన కారు వైపు పరుగెత్తుకుంటూ వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బ్రిజ్ భూషణ్.. "ఈ రోజు రెజ్లర్లు గంగానదిలో పతకాలను నిమజ్జనం చేయడానికి వెళ్లారు, కానీ గంగా నదికి బదులుగా, వారు రాకేశ్ టికైత్‌కు మెడల్స్ ఇచ్చారు.. ఇది వారి స్టాండ్. నా పదవీకాలం ముగిసింది. నేను దోషిగా తేలితే, నన్ను అరెస్టు చేస్తారు. నేనైతే రాజీనామా చేసే ప్రసక్తే లేదు " అని అన్నారు.
महिला पहलवानों के मुद्दे पर केंद्रीय मंत्री मीनाक्षी लेखी ने दी तीखी प्रतिक्रिया
— Congress (@INCIndia) May 30, 2023
आप खुद देखें 👇 pic.twitter.com/9XqyJcwmgD