IIT Graduates: రూ.లక్షల జీతం వద్దనుకొని.. సన్యాసులుగా మారిన IIT గ్రాడ్యుయేట్లు
X
దేశంలో చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియేట్ లేదా 12 వ తరగతి(ప్లస్ 2) పూర్తి కాగానే.. వెంటనే ఇంజనీరింగ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటారు. ఇంజనీరింగ్ చేస్తే.. జాబ్ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయని, శాలరీస్ కూడా లక్షల్లో ఉంటాయని భావించి ఆ దారిలోనే IIT-JEE పరీక్షకకు సన్నద్ధమవుతారు. కష్టపడి చదివి ఆ పరీక్షలో అర్హత సాధించి దేశంలోని ప్రముఖ IITలో సీటు సంపాదిస్తారు. అంతే కష్టపడి పట్టుదల చదివి, ఇక IIT పూర్తయ్యే లోపు.. దేశంలోని ప్రముఖ కంపెనీల నుంచే కాదు.. ఇంటర్నేషనల్ కంపెనీస్ నుంచి కూడా మంచి జాబ్ ఆఫర్స్ ఈజీగానే అందుకుంటారు. మంచి ప్యాకేజీతో ఉద్యోగాల్లో జాయిన్ అయ్యాక.. అక్కడ కిక్ దొరకకనో లేదంటే మరేతర కారణాల వల్లో కానీ కొంతమంది ఐఐటి గ్రాడ్యుయేట్లు మాత్రం.. లక్షల జీతాలొచ్చే ఉద్యోగాలు వదిలేసి.. అంతకంటే బెటర్ అనుకునే వివిధ రంగాల్లో సెటిల్ అయి అందరికీ షాకిస్తున్నారు.
ఇప్పటివరకు కొందరు ఐఐటీయన్లు.. లక్షల రూపాయల జీతాన్ని వద్దనుకొని స్టాండప్ కమెడియన్ అయ్యారని, లేదంటే టీ షాప్స్ (చాయ్ కొట్లు)పెట్టి రూ. కోట్ల వ్యాపారాన్ని విస్తరించారని, లాండ్రీ వ్యాపారం,రైతుగా మారి అధిక లాభాలను గడిస్తున్నారని.. ఇలా చాలా కథనాలు చదివాం, విన్నాం. కానీ ఐఐటీ వదిలి సన్యాసుల్లో చేరి అంతకుమించి అనేంతలా డబ్బు సంపాదిస్తున్న గురించి మాత్రం కచ్చితంగా ఇంతకుముందు విని ఉండరు. ప్రస్తుతం కథనం గురించి తెలిస్తే మాత్రం ఐఐటీ స్టూడెంట్లు.. సన్యాసులుగా మారడం ఏంటి? లక్షల్లో సంపాదించడమేంటి? అనే అనుమానాలు రాకమానవు. ఈ 8 మంది IIT గ్రాడ్యుయేట్‌లు కూడా లక్షల జీతాలని వదిలేసి సన్యాసులుగా మారారు.
సందీప్ కుమార్ భట్ IIT: ఢిల్లీ IIT నుండి ఇంజనీరింగ్ చదివిన సందీప్ కుమార్ భట్.. 2002 బ్యాచ్‌లో గోల్డ్ మెడలిస్ట్. 2004లో ఎంటెక్ చేసిన తర్వాత లార్సెన్ అండ్ టూబ్రోలో మూడేళ్లు పనిచేశారు. లక్షలో జీతం అందుకున్నారు. ఆ తర్వాత హఠాత్తుగా 2007లోనే ఉద్యోగం మానేసి.. 28 ఏళ్లకే రిటైర్‌మెంట్ బాట పట్టాడు. సన్యాసి అయిన తరువాత, అతను తన పేరును స్వామి సుందర్ గోపాల్ దాస గా మార్చుకున్నాడు.
అవిరాల్ జైన్ : ఢిల్లీకి చెందిన అవిరాల్ జైన్.. దయానంద్ విహార్‌లోని DAV పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఆ తర్వాత JEE పరీక్ష రాసి IIT BHUలో అడ్మిషన్ తీసుకున్నాడు. అక్కడి నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ డిగ్రీ తీసుకున్నాక వాల్‌మార్ట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అతని వార్షిక ప్యాకేజీ రూ.40 లక్షలు. ఫిబ్రవరి 2019 లో, అతను తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, విశుద్ధ సాగర్జీ మహారాజ్ ఆశ్రయానికి వెళ్లి, అక్కడే సన్యాసిగా మారాడు.
సంకేత్ పరేఖ్: ముంబైకి చెందిన సంకేత్ పరేఖ్ కూడా ఐఐటీ చేశాడు. బాంబే ఐఐటీలో కెమికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొంది... అమెరికన్ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయ్యడానికి సన్నద్ధమవుతుండగా.. తన సీనియర్ మాటలు ఆయన్ను మార్చాయి. ఆ సీనియర్ సంకేత్‌కి జైనమతం గురించి చెప్పగా.. సంకేత్ దానికి అట్రాక్ట్ అయి.. ఇంజనీరింగ్ మార్గాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసుకున్నాడు.
రసనాథ్ దాస్: ముంబైకి చెందిన రసనాథ్ దాస్ ఐఐటీ బాంబేలో చదివి అమెరికా వెళ్లారు. 2000 సంవత్సరంలో, అతను అక్కడ ఉన్న డెలాయిట్ లో పనిచేశాడు. ఆ తర్వాత కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. 2006లో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా పని చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా అన్నింటినీ విడిచిపెట్టి కృష్ణుడిపై భక్తితో సన్యాసి అయ్యాడు.
ఖుర్షీద్ బట్లీవాలా: IIT బాంబే నుండి తన M.Sc పూర్తి చేసిన ఖుర్షీద్ బట్లీవాలా కూడా సన్యాసంలోనే ఉన్నాడు. మనదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ పై అనేక ప్రేరణ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించాడు.
స్వామి ముకుందానంద: ఢిల్లీ IIT లో BTech చేసిన స్వామి ముకుందానంద... ఆ తర్వాత IIM కలకత్తా నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు. ప్రస్తుతం అతను టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉన్న JKYog అనే సన్యాసులు, యోగ మార్గానికి సంబంధించి సంస్థకు వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఆచార్య ప్రశాంత్: ఈయన అసలు పేరు ప్రశాంత్ త్రిపాఠి. ఢిల్లీ ఐఐటీలో ఇంజినీరింగ్ చేశారు. అతను చాలా సంవత్సరాలు సివిల్ సర్వెంట్‌గా కూడా పనిచేశాడు. ఇప్పుడు మాత్రం సన్యాసిగా సేవలందిస్తున్నాడు.
మహాన్ మహారాజ్: ఐఐటీ కాన్పూర్‌లో గ్రాడ్యుయేషన్ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ మహాన్ .. బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటి నుండి PhD పొందాడు. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. ఇప్పుడు అవన్నీ వదిలేసి జ్ణానాన్ని బోధిస్తున్నాడు.