Home > జాతీయం > రాజధాని కోసం సీఎం ఆఫీసుపై దాడి.. పలువురికి గాయాలు

రాజధాని కోసం సీఎం ఆఫీసుపై దాడి.. పలువురికి గాయాలు

రాజధాని కోసం సీఎం ఆఫీసుపై దాడి.. పలువురికి గాయాలు
X

రాజధాని వివాదం ముఖ్యమంత్రి కార్యాలయంపై దాడికి దారి తీసింది. మేఘాలయ సీఎం కన్రాడ్‌ సంగ్మా ఆఫీసుపై సోమవారం సాయంత్రం ఆందోళనకారులు దాడి చేశారు. రాళ్లు రువ్వడంతో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని నిరసనకారులు షిల్లాంగ్‌లోని సీఎం ఆఫీసును ముట్టడించారు. సంగ్మా సురక్షితంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. ఆందోళనకారులు రహదారిని దిగ్బంధించడంత ఆయనతోపాటు ఓ మంత్రి కూడా ఆఫీసులో ఉన్నట్లు చెప్పారు. వివాదంపై సీఎం ఒకపక్క ఆందోళనకారుల ప్రతినిధులతో చర్చిస్తున్నప్పుడే దాడి జరగడం గమనార్హం.

గారో హిల్స్‌ ప్రాంతానికి చెందిన పలు ప్రజాసంఘాలు తురాలో చలికాల రాజధాని కోసం కొన్నేళ్లుగా ఉద్యమిస్తూ తాజాగా నిరాహార దీక్షకు దిగాయి. కొందరు ఆందోళనకారులు సీఎం ఆఫీసుపై రాళ్లు విసరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాయపడిన వారిని వెంటనే ఆఫీసు లోపలికి తీసుకెళ్లారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. అల్లరిమూకను చెదరగొట్టానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. శీతాకాల రాజధాని ఏర్పాటుపై వచ్చే నెల 8వ తేదీనగాని, లేకపోతే 9వ తేదీనగాని చర్చలకు రావాలని సీఎం ఉద్యమ సంఘాలను ఆహ్వానించారు.


#WATCH | Meghalaya CM Conrad Sangma was having discussions with agitating organisations based in Garo-Hills who are on a hunger strike for a winter capital in Tura: CMO PRO

Updated : 24 July 2023 10:26 PM IST
Tags:    
Next Story
Share it
Top