Home > జాతీయం > మున్సిపల్ నిధులపై చర్చ.. పిడిగుద్దులతో రెచ్చిపోయిన కౌన్సిలర్లు

మున్సిపల్ నిధులపై చర్చ.. పిడిగుద్దులతో రెచ్చిపోయిన కౌన్సిలర్లు

మున్సిపల్ నిధులపై చర్చ.. పిడిగుద్దులతో రెచ్చిపోయిన కౌన్సిలర్లు
X

ఉత్తర్ప్రదేశ్ షామ్లీ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ రసాభాసగా మారింది. అభివృద్ధి పనులు, నిధుల విషయంలో కౌన్సిలర్ల మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. మీటింగ్ హాల్ కాస్తా రెజ్లింగ్ రింగ్లా మారిపోయింది. కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు.

షామ్లీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రూ. 4కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చ జరిగింది. అయితే ఈ విషయంలో ఇద్దరు సభ్యుల మధ్య మాటామాటా పెరిగింది. స్థానిక ఎమ్మెల్యే, కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎదుటే వారిద్దరూ బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. వారిని ఆపేందుకు వెళ్లిన మరో సభ్యుడికి కూడా దెబ్బలు తగిలాయి. దీంతో కొన్ని నిమిషాల్లో మున్సిపల్‌ కౌన్సిల్‌ కాస్తా రెజ్లింగ్‌ బౌట్‌గా మారిపోయింది. దీంతో చైర్మన్‌ ఎలాంటి చర్చ లేకుండానే సభ వాయిదా వేశారు.

మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో జరిగిన రచ్చకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే అదునుగా దానిని ట్విట్టర్లో పోస్ట్ చేసిన సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అధికారపార్టీపై సటైర్లు వేశారు. ఈ వీడియో స్థానిక సంస్థల్లో నెలకొన్న పరిస్థితి, అధికార బీజేపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలకు అద్దం పడుతోందని విమర్శించారు. ఎలాంటి అభివృద్ధి పనులు జరగనప్పుడు రివ్యూ మీటింగ్ లలో ఇలాంటి ఘటనలే జరుగుతాయని సటైర్ వేశారు. బీజేపీ పాలనలో రివ్యూ మీటింగ్ కు సెక్యూరిటీతో రావాలని ఈ ఘటన రుజువు చేస్తోందని అఖిలేష్ ట్విట్టర్లో రాసుకొచ్చారు.

Updated : 29 Dec 2023 1:50 PM IST
Tags:    
Next Story
Share it
Top