Home > జాతీయం > Notepad : మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం.. ఇక వర్డ్‌ప్యాడ్‌‌కు గుడ్‌బై

Notepad : మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం.. ఇక వర్డ్‌ప్యాడ్‌‌కు గుడ్‌బై

Notepad : మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం.. ఇక వర్డ్‌ప్యాడ్‌‌కు గుడ్‌బై
X

వీండోస్‌లో ఏళ్ళుగా ఉపయోగిస్తున్న వర్డ్‌ప్యాడ్‌ (Wordpad)కథ త్వరలో ముగియనుంది. మైక్రోసాఫ్ట్‌ అప్‌ కమింగ్ ఓఎస్‌ వర్షన్‌లలో వర్డ్‌ప్యాడ్‌‌ను తొలిగించనుంది. కంప్యూటర్ యూజర్స్ కు వర్డ్‌ప్యాడ్‌‌ను 28 ఏళ్లుగా సుపరచితం 1995 నుండి విండోస్‌ వర్షన్స్ మారుతున్న వర్డ్‌ప్యాడ్‌‌ను అలాగే కొనసాగించారు. వర్డ్‌ప్యాడ్ కంటే ముందుగా మైక్రోసాఫ్ట్ రైట్ ఉండేది. కొత్త వర్షన్స్‌లో మరిన్ని ఫీచర్లు, అధునాతన హంగులతో కూడిన నోట్‌ప్యాడ్ వెర్షన్‌ను తీసుకురానున్నారు. కొత్త వర్షన్ వచ్చే వరకు కూడా ప్రస్తుత నోట్‌ప్యాడ్ కొనసాగుతుంది. దీనితో పాటు, కంపెనీ పీపుల్ యాప్‌ను కూడా తొలగిస్తోంది. కొత్త విండోస్‌ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఈ రెండు ఫీచర్స్ అందుబాటులో ఉండవు.

మైక్రోసాఫ్ట్ వర్డ్‌ప్యాడ్‌కు బదులుగా MS వర్డ్, నోట్‌ప్యాడ్‌లను ఉపయోగించుకోవాలని సంస్థ వినియోగదారులను సూచిస్తోంది. doc,rtf ఫైల్‌ల కోసం MS Wordను ఉపయోగించుకోవచ్చు. కొత్త మైక్రోసాఫ్ట్‌ వర్డ్ వర్షన్‌ను విండోస్‌ 365 ప్యాకేజీలో భాగంగా లభించనుంది. దీనిని ఉపయోగించుకోవాలంటే సబ్‌స్క్రిప్షన్‌ చెల్లించాల్సి ఉంటుంది. లేటెస్ట్ నోట్‌ప్యాడ్‌లో (Notepad) ఆటో సేవ్‌, ఆటో రీస్టోర్‌ వంటి సదుపాయాలు ఉంటాయి. ఇక మైక్రోసాఫ్ట్‌ తన లేటెస్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్‌ 12ను ఈ ఏడాదిలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

Updated : 9 Jan 2024 2:53 PM GMT
Tags:    
Next Story
Share it
Top