Home > జాతీయం > Accident : ఘోర ప్రమాదం.. మూడు కార్లను ఢీకొట్టిన పాల ట్యాంకర్

Accident : ఘోర ప్రమాదం.. మూడు కార్లను ఢీకొట్టిన పాల ట్యాంకర్

Accident : ఘోర ప్రమాదం.. మూడు కార్లను ఢీకొట్టిన పాల ట్యాంకర్
X

సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాణిపూల్‌లో పాల ట్యాంకర్ మూడు కార్లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రాణిపూల్లో తంబోలా కార్యక్రమం నిర్వహించారు. అకస్మాతుగా ఓ పాల ట్యాంకర్ అక్కడ ఉన్న మూడు కార్లను ఢీకొట్టింది. వాహనాల కింద పడి ముగ్గురు మరణించగా.. 20మంది గాయపడ్డారు. ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాలకు సిక్కిం ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించింది.

Updated : 11 Feb 2024 7:44 AM IST
Tags:    
Next Story
Share it
Top