ఒవైసీ ఇంటిపై మళ్లీ దాడి..
X
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. ఢిల్లీ అశోకా రోడ్డులోని ఆయన అధికార నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆదివారం సాయంత్రం దండగులు బంగ్లా తలుపు అద్దాలను పగలగొట్టారు. బంగ్లా కాపలాదారు రోహిత్ పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన ప్రాంతంలో రాళ్లు కనిపించలేదని, దేనితో దాడి చేసి ఉంటారో విచారణ జరుపుతున్నామని చెప్పారు. బంగ్లా దగ్గరికి వెళ్లి చుట్టుపక్కల వారిని విచారిస్తున్నామని, సీసీ కెమెరాల ఫుటీజీని పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ బంగ్లాపై దాడి జరగడం గత ఆరు నెలల్లో ఇది రెండోసారి ఈ ఏడాది ఫిబ్రవరి 19న కూడా ఒవైసీ నివాసంపై గుర్తు తెలియని దుండగలు రాళ్లు రువ్వారు. పంద్రాగస్టు వేడుకల సందర్బంగా దేశ రాజధానిలో భద్రతను పటిష్టం చేశారు. అయినా వీఐపీలు ఉండే అశోకా రోడ్డులోనే దాడి జరిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.