Minister Roja : 'అమ్మా.. పురంధేశ్వరి.. నీ పని నువ్వు చేసుకో..' మంత్రి రోజా
X
బీజేపీ నేత, ఎంపీ పురందేశ్వరిని మీ పని మీరు చేసుకోవాలంటూ సలహ ఇచ్చారు ఏపీ మంత్రి రోజా. సీఎం జగన్ పై సీబీఐ కేసులను త్వరగా విచారణ చేపట్టాలంటూ సుప్రీంకు పురందేశ్వరి లేఖ రాయడంపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తనపై ఉన్న కేసులను త్వరితగతిన విచారించాలని సీఎం జగన్ ఎప్పుడో పిటిషన్ వేశారని, ఆ విషయం తెలుసుకోవాలని సూచించారు. నిజంగా.. నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు కేసులపై విచారణ చేయమని సీబీఐ కి లెటర్ రాయాలని ఉన్నారు. ఎన్టీఆర్ కూతురు పేరు వాడుతూ.. అన్ని పార్టీలు మారుతూ.. పదవులు అనుభవిస్తున్నారని ఆరోపించారు. తండ్రికి ఒక్కపూట అన్నం పెట్టలేని పురందేశ్వరి అధికారం కోసం పాకులాడుతున్నారని.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడంతో చంద్రబాబుని మించిన జగత్కిలాడీ సంచలన ఆరోపణలు చేశారు.
నగిరి నియోజకవర్గం వడమాల పేటలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రోజా..పై విధంగా ఆరోపణలు చేశారు. తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు తరపున బీజేపీ అధ్యక్షురాలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పురంధరేశ్వరి తన చేతల్ని, నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కరవు సమయంలో రెయిన్ గన్లతో బాబు స్కాం చేశారని.. త్వరలో ఆ ఆధారాలు బయటకు వస్తాయన్నారు. కచ్చితంగా ఆ విషయంలోనూ చంద్రబాబుపై కేసులు పడతాయని.. ఆయన మళ్లీ జైలుకెళ్లడం ఖాయమన్నారు.