Home > జాతీయం > సోనియాను కలిసిన ఉత్తమ్ దంపతులు

సోనియాను కలిసిన ఉత్తమ్ దంపతులు

సోనియాను కలిసిన ఉత్తమ్ దంపతులు
X

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను మంత్రి ఉత్తమ్ దంపతులు కళిశారు. బుధవారం ఢిల్లీ వెళ్లిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్ పథ్ లో సోనియా, రాహుల్ గాంధీలను మర్యాదపూర్వకంగా కలిశారు. సోనియా, రాహుల్ లతో ఎలాంటి రాజకీయాలు చర్చించలేదని, కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశామని భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత లోక్ సభకు వెళ్లి స్పీకర్ ఓ బిర్లాకు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఎంపీ పదవికి రాజనామా చేశారు.


Updated : 13 Dec 2023 4:12 PM IST
Tags:    
Next Story
Share it
Top