Home > జాతీయం > Controversy : 'ఐశ్వర్యరాయ్‌ కళ్లు చూశారా.. చేపలు తింటే మీక్కూడా..' నోరు జారిన మంత్రి

Controversy : 'ఐశ్వర్యరాయ్‌ కళ్లు చూశారా.. చేపలు తింటే మీక్కూడా..' నోరు జారిన మంత్రి

Controversy : ఐశ్వర్యరాయ్‌ కళ్లు చూశారా.. చేపలు తింటే మీక్కూడా.. నోరు జారిన మంత్రి
X

బహిరంగ సభలో ఓ బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చేపలు తింటే ప్రయోజనాల గురించి చెబుతూ.. బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌పై కామెంట్స్ చేశారు మహారాష్ట్ర మంత్రి విజయ్ కుమార్ గవిట్(68). రోజూ చేపలు తింటే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కండ్ల లాగా మన కండ్లు కూడా చాలా అందంగా తయారవుతాయన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు, ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు మండి పడుతున్నాయి.

మహారాష్ట్రలోని నందూర్బర్‌ జిల్లాలో మత్స్యకారులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ప్రతిరోజు చేపలు తినడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుందని, కళ్లు మెరుస్తాయని, ఎవరైనా చూస్తే వెంటనే ఆకర్షితులవుతారని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలో.. ‘ఐశ్వర్యరాయ్ గురించి నేను మీకు చెప్పలేదు కదూ.. ? ఆమె మంగళూరులోని సముద్ర తీరానికి సమీపంలో నివసించేది. ఐశ్యర్య రోజూ చేపలు తినేది. మీరు ఆమె కళ్ళు చూశారా? రోజూ చేపలు తింటే మీ కళ్లు కూడా టైశ్వర్యరాయ్‌ లాగే అందంగా తయారవుతాయి. చేపలో కొన్ని రకాల నూనెలు ఉంటాయి. అవి మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి.’ అని మంత్రి చెప్పారు.

ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెద్ద దుమారాన్నే రేపాయి. మంత్రి గవిట్‌ ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయకుండా గిరిజనుల సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని ఎన్‌సీపీ ఎమ్మెల్యే అమోల్‌ మిట్కారీ అన్నారు. ‘‘నేను ప్రతిరోజు చేపలు తింటాను. మరి నా కళ్లు కూడా ఐశ్యర్య కళ్లలా మారాలి కదా. బహుశా దీనిపై ఏమైనా పరిశోధన చేయాలేమో.. నేను గవిట్‌నే అడుగుతాను.’’ అని బీజేపీ ఎమ్మెల్యే నితీశ్‌ రానే సరదాగా వ్యాఖ్యానించారు.


Updated : 22 Aug 2023 8:44 AM IST
Tags:    
Next Story
Share it
Top