ప్రభుత్వ అధికారిపై చేయిచేసుకున్న మహిళా ఎమ్మెల్యే
X
అధికార దర్పంతో ఓ మహిళా ఎమ్మెల్యే రెచ్చిపోయింది. సివిల్ ఇంజనీర్ పై చేయి చేసుకుంది. అందరూ చూస్తుండగానే సదరు అధికారి చెంప చెల్లుమనిపించింది. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
థానే జిల్లాలో ప్రభుత్వ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిథిలో జరుగుతున్న కూల్చివేతలకు సంబంధించి స్థానికులు మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్ ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన సదరు ఎమ్మెల్యే అధికార దర్పంతో రెచ్చిపోయారు. ప్రభుత్వ అధికారులను ఇష్టానుసారంగా తిట్టారు. సివిల్ ఇంజనీర్ ను బండబూతులు తిట్టారు. ఇండ్లు కూల్చివేస్తే పిల్లులతో కలిసి నిర్వాసితులు రోడ్లపైనే ఉండాలా అని ఆగ్రహం వ్యక్తంచేసింది. అయితే పై అధికారుల ఆదేశాల మేరకు నిర్మాణాలను కూల్చి వేస్తున్నామని సదరు సివిల్ ఇంజనీర్ నవ్వుతున్నాడంటూ గీతా జైన్ రెచ్చిపోయారు. నీకు నవ్వెలా వస్తుందంటూ సదరు అధికారి కాలర్ పట్టుకుని చెంప చెల్లుమనిపించారు.
आमदार गीता जैन ताई ही कुठली पद्धत आहे अधिकाऱ्यावर हात उचलून प्रश्न सोडवण्याची.अधिकारी चुकला असेल तर सरकार मधे आहात कायदेशीर कार्यवाही करा कायदा हातात घेण्याचा अधिकार तुम्हाला कोणी दिला आहे ? @CMOMaharashtra यांच्यावर कार्यवाही करणार की आमदारांना कायदा हातात घेण्याची सूट आहे ? pic.twitter.com/ndJGyhLVyR
— Suraj Chavan (सूरज चव्हाण) (@surajvchavan) June 20, 2023
ఎమ్మెల్యే గీతా జైన్ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పై అధికారుల ఆదేశాలు పాటిస్తున్న సివిల్ ఇంజనీర్ పై చేయి చేసుకోవడాన్ని తప్పుబడుతున్నారు. గతంలో గీతా జైన్ భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు బీజేపీ తరుపున మేయర్ పనిచేశారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం బీజేపీ-శివసేన ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు.