మా సార్కు అమ్మాయిల కొరత లేదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే
X
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ నుంచి వాకౌంట్ చేస్తూ రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇవ్వగా.. దాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. తాజాగా బీహార్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతు సింగ్ ఈ అంశంపై మాట్లాడగా.. ఈ ఘటన రాజకీయంగా మళ్లీ తెరపైకి వచ్చింది. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన రాహుల్.. సభ నుంచి వాకౌట్ చేస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఆ టైంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతున్నారు. రాహుల్ చర్యను వ్యతిరేకించిన స్మృతి.. రాహుల్ తమను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్లో బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మహిళా నేతలను చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఏంటని ఆరోపిస్తూ స్పీకర్కు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీ.. మహిళలకు ఎంత గౌరవం ఇస్తుందో రాహుల్ చర్యల వల్ల తెలుస్తుందంటూ ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై బీహార్ ఎమ్మెల్యే నీతు సింగ్ తాజాగా స్పందించారు. ‘రాహుల్కు అమ్మాయిల కొదువలేదు. అయినా ఆయన ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు ఇస్తారు. కానీ, 50 ఏళ్ల మహిళకు ఎందుకిస్తారం’టూ స్మృతి ఇరానీని ఉద్దేశించి మాట్లాడారు. నీతు వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను బీజేపీ అధికారిక ప్రతినిధి షెహ్ జాద్ పూనావాలా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. యాంటీ మహిళా కాంగ్రెస్ రాహుల్ గాంధీ చర్యను సమర్థిస్తోందంటూ నిప్పులు చెరుగుతున్నారు.
If Rahul Gandhi wants to give flying kiss he has many women available
— Shehzad Jai Hind (@Shehzad_Ind) August 10, 2023
He won’t give it to a 50 year old budhiya
Congress MLA from Bihar : Neetu Singh
Anti women Congress can even defend Rahul’s misdemeanours inside the House pic.twitter.com/oXRz67ZqlX