Home > జాతీయం > బీజేపీలో ఆధిపత్య పోరు.. అధిష్టానంపై అసహనంతో పెద్ద లీడర్లు

బీజేపీలో ఆధిపత్య పోరు.. అధిష్టానంపై అసహనంతో పెద్ద లీడర్లు

బీజేపీలో ఆధిపత్య పోరు.. అధిష్టానంపై అసహనంతో పెద్ద లీడర్లు
X

రాష్ట్ర బీజేపీ పార్టీలో ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నాయకులంతా.. తమకు కీలక పదవులు కావాలని కూర్చున్నట్లు తెలుస్తోంది. ఈ గందగోళ పరిస్థుల నడుమ.. రాష్ట్ర అధ్యక్షుడు మార్పుతో పాటు.. పలువురు నేతలకు కేంద్ర మంత్రి పదవులు కట్టబెడుతుండే సరికి, మిగతా లీడర్లలో అసంతృప్తి నెలకొంది. అదిష్టానం తమను పట్టించుకోవట్లేదని, తగిన గుర్తింపు ఇవ్వట్లేదని ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని పార్టీలు తమ బలాలను పెంచుకుంటున్న క్రమంలో.. కీలక సమయంలో బీజేపీ నేతలు ఆధిపత్యం కోసం పాకులాడటం, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పార్టీ అధిష్టానంపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఎంతో కష్టపడుతున్నా.. అధిష్టానానికి కానరావట్లేదని రఘునందన్ అంటున్నట్లు సమాచారం. పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రఘునందన్ రావు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు కీలక బాధ్యతలు ఇవ్వాలని పార్టీ అధిష్టాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవులపై చర్చలు వచ్చిన ప్రతి సందర్భంలో.. కులాన్ని చూపి తనకు రావాల్సిన పదవులు అడ్డుకుంటున్నారని, సొంత పార్టీ నాయకులే తనపై కోవర్టు ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ఇప్పటికైనా తనను గుర్తించి కీలక పదవి కట్టబెట్టాలని అంటున్నారు. ఈ క్రమంలో రఘునందన్ రావు అధిష్టానాన్ని చేస్తున్న డిమాండ్స్ ఏంటంటే...

రఘునందన్ డిమాండ్స్:

1. పార్టీలో ఏదో ఒక కీలక పదవి అడుగుతున్న

2. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ హోదా

3. జాతీయ అధికార ప్రతినిధి హోదా

4. జాతీయ కార్యవర్గంలో చోటు

5. రాష్ట్ర పార్టీలో తగిన ప్రధాన్యత




Updated : 29 Jun 2023 6:13 PM IST
Tags:    
Next Story
Share it
Top