Home > జాతీయం > Rajasingh : శోభయాత్ర చేస్తే అంతుచూస్తాం.. MLA రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్..

Rajasingh : శోభయాత్ర చేస్తే అంతుచూస్తాం.. MLA రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్..

Rajasingh : శోభయాత్ర చేస్తే అంతుచూస్తాం.. MLA రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్..
X

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. రామనవమి శోభాయాత్ర చేస్తే.. చంపేస్తామంటూ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, రాజాసింగ్ మీడియాకు చెప్పారు. ‘ఫోన్‌లో కాదు దమ్ముంటే నేరుగా రావాలని’ సవాల్ విసిరారు. రామనవమి రోజున శోభయాత్ర చేస్తే చంపేస్తామని కొందరు ఫోన్‌లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని స్వయంగా వీడియో విడుదల చేసి రాజాసింగ్ వెల్లడించారు. 7199942827, 4223532270 నంబర్స్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని అన్నారు. గతంలోనూ ఇదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజాసింగ్ చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంతదూరమైనా వెళ్తానని ప్పారు. ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేవని అన్నారు.

గతంలో కూడా ఇదే తరహాలో రాజసింగ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో రాజాసింగ్‌కు తాజాగా బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే రాజా సింగ్ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ (అప్పటి డీజీపీ)కు లేఖ రాశారు. తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనకు ఏ ఏ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయో.. ఆ జాబితాను డీజీపీకి రాసిన లేఖలో వివరించారు. తనను చంపుతామంటూ పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా చెప్పారు.




Updated : 14 Jan 2024 2:40 PM IST
Tags:    
Next Story
Share it
Top