Home > జాతీయం > MODI : ఉదయనిధికి దీటుగా జవాబు చెప్పాలి: మోదీ

MODI : ఉదయనిధికి దీటుగా జవాబు చెప్పాలి: మోదీ

MODI : ఉదయనిధికి దీటుగా జవాబు చెప్పాలి: మోదీ
X

సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి. పలువురు ఉదయనిధి కామెంట్స్ ను విమర్శిస్తే.. మరికొందరు క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంపై ప్రధాని మోదీ స్పందించారు. ఉదయనిధి కామెంట్స్ కు దీటుగా, సందర్భానికి తగ్గట్లు సరైన జవాబు ఇవ్వాలని కేంద్ర మంత్రులకు సూచించారు. జీ20 సమ్మిట్ సందర్భంగా కేంద్ర మంత్రులతో మాట్లాడిన మోదీ.. దిశా నిర్దేశం చేశారు.





‘మరీ చరిత్ర లోతుల్లోకి వెళ్లొద్దు. రాజ్యాంగబద్ధంగా వాస్తవాలకు కట్టుబడి, ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడండి. సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు తగిన విధంగా స్పందించండి’అని మోదీ మంత్రులకు తెలిపారు. దేశం పేరు అంశంపై కూడా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని మంత్రులకు చెప్పారు. ఈ అంశంపై పార్టీ ప్రతినిధులు మాత్రమే మాట్లాడతారని స్పష్టం చేశారు. కాగా, ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కొడుకు ప్రియాంక్ ఖర్గేపై బుధవారం యూపీలోని రామ్ పూర్ లో పోలీస్ కేసులు నమోదయ్యాయి.







Updated : 7 Sept 2023 8:05 AM IST
Tags:    
Next Story
Share it
Top