DA HIKE: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
X
ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. డీఏను 4శాతం పెంచింది. పెరిగిన డీఏ జూలై 1, 2023 నుంచి అమలులోకి రానుంది. దీంతో 48లక్షల ఉద్యోగులతో పాటే పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఈ ఏడాది మొదటి డీఏ 4 శాతం పెరిగ్గా.. రెండో డీఏ కూడా 4 శాతం పెంచారు. ప్రస్తుతం డీఏ 42శాతంగా ఉండగా.. తాజా పెంపుతో అది 46శాతానికి పెరిగింది. ఏడాది మొదటి డీఏ పెంపు ప్రకటన మార్చిలో రాగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేశారు.
మరోవైపు గ్రూప్- సీ, నాన్ గెజిటెడ్ గ్రూప్- బీ ర్యాంక్ ఉద్యోగులకు కేంద్రం దీపావళి బోనస్ ప్రకటించింది. ఇందులో పారామిలిటరీ బలగాలు కూడా ఉన్నాయి.ఈ నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనినే అడ్-హక్ బోనస్ అని కూడా పిలుస్తారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండేచర్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.