Modi : రైతుల ఆందోళనపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
X
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన కొనసాగుతోంది. తాము పండించిన పంటకు కనీస మద్ధతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనతో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులపై పోలీసులు రబ్బరు బులెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసుల దాడుల్లో ఓ యువ రైతు మరణించారు. ఈ ఘటనతో రెండు రోజుల పాటు ఆందోళనకు కిసాన్ మోర్చా బ్రేక్ ఇచ్చింది. అయితే రైతుల ఆందోళనపై ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
చెరుకు రైతులకు ప్రోత్సాహాన్ని పెంచిన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చెరకు రైతులకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని రూ.25 పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల కోట్లాది మంది చెరుకు రైతులకు ఎంతో లాభం జరుగుతుందని మోదీ తెలిపారు. కేబినెట్ నిర్ణయంతో చెరకు పంట ఎఫ్ఆర్పీ క్వింటాల్ కు రూ. 340 కు చేరింది. అక్టోబర్ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది. 2023-24 ఏడాదితో పోలిస్తే ఇది 8శాతం ఎక్కువ.