Home > జాతీయం > MODI : ఇప్పటికైనా మీ వైఖరి మారాలి..ప్రతిపక్షాల పై భగ్గుమన్న మోదీ

MODI : ఇప్పటికైనా మీ వైఖరి మారాలి..ప్రతిపక్షాల పై భగ్గుమన్న మోదీ

MODI : ఇప్పటికైనా మీ వైఖరి మారాలి..ప్రతిపక్షాల పై భగ్గుమన్న మోదీ
X

ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు ప్రధానీ నరేంద్ర మోదీ. పార్లమెంట్‌ కార్యకలాపాలను తరచూ అడ్డుకునే ఎంపీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యనికి వ్యతిరేకంగా, అనైతికంగా వ్యవహరించిన వారు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. ఇలా ఇబ్బంది పెట్టే వారిని ఎవరూ గుర్తుపెట్టుకోరని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునే వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో పక్కాగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధానీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మల సీతారమన్ ‘దిశా నిర్దేశక్‌’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా ఆశీర్వాదంతో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతామని ప్రధానీ మోదీ ధీమా వ్యక్తం చేశారు.

శాంతి పరిరక్షణలో మహిళలు కీలకంగా మారుతున్నారన్నారు మోదీ. కొత్త పార్లమెంట్‌ భవనంలో నిర్వహించిన తొలి సమావేశాల్లో ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’ పేరుతో మహిళా రిజర్వేషన్లకు ఆమోదం తెలిపి చారిత్రక నిర్ణయం తీసుకున్నామన్నారు. జనవరి 26న కర్తవ్యపథ్‌లో మన నారీశక్తిని ప్రపంచానికి చాటిచెప్పామని తెలిపారు. ఇవాళ బడ్జెట్‌ సమావేశాలు కూడా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మునే ప్రారంభించారన్నారు. అంతేగాక రేపు బడ్జెట్ ను ప్రవేశపెట్టేది కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే అని..ఇదే మన నారీశక్తికి ప్రతీక అని మోదీ కొనియాడారు. రేపు పార్లమెంట్ లో కేంద్రం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. గత సంఘటనల దృష్ట్యా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. అంతేగాక సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి.




Updated : 31 Jan 2024 6:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top