Home > జాతీయం > పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు.. రేపు అఖిలపక్ష భేటీ

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు.. రేపు అఖిలపక్ష భేటీ

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు.. రేపు అఖిలపక్ష భేటీ
X

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9వరకు సమావేశాలు జరగనున్నాయి. 2024 లోక్‌‌‌‌స‌‌‌‌భ ఎన్నిక‌‌‌‌ల‌‌‌‌ నేపథ్యంలో కేంద్రం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని వివిధ పార్టీలకు పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. సభ నిర్వహణ సహా వివిధ అంశాలపై చర్చింనున్నారు.

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్‌. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవసరమైన ఖర్చులకు పార్లమెంట్‌ ఆమోదం తీసుకునేందుకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో మహిళా రైతులను ఆకట్టుకునేలా కీలక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. 17వ లోక్‌సభ గడువు జూన్‌ 16న ముగియనున్నది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.


Updated : 29 Jan 2024 7:28 PM IST
Tags:    
Next Story
Share it
Top