Home > జాతీయం > MODI : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఇవాళ అఖిలపక్ష భేటీ

MODI : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఇవాళ అఖిలపక్ష భేటీ

MODI : రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఇవాళ అఖిలపక్ష భేటీ
X

మోడీ సర్కార్ తన చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. బుధవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభంకాగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని వివిధ పార్టీలకు పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. సభ నిర్వహణ సహా వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సభ సజావుగా జరిగేలా చూడాలని విపక్షాలను కేంద్రం కోరనుంది.

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్‌. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవసరమైన ఖర్చులకు పార్లమెంట్‌ ఆమోదం తీసుకునేందుకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల అనంతరం కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రైతులను ఆకట్టుకునేలా మోదీ సర్కార్ కీలక ప్రకటన చేయబోతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏయే వర్గాలకు ఈ బడ్జెట్లో ఊరట కలిగిస్తుందనేది వేచి చూడాలి. కాగా 17వ లోక్‌సభ గడువు జూన్‌ 16న ముగియనున్నది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.


Updated : 30 Jan 2024 1:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top