Home > జాతీయం > President of bharat : ఇండియా పేరు మార్పు... ప్రత్యేక సమావేశాల్లో బిల్లు..?

President of bharat : ఇండియా పేరు మార్పు... ప్రత్యేక సమావేశాల్లో బిల్లు..?

President of bharat : ఇండియా పేరు మార్పు... ప్రత్యేక సమావేశాల్లో బిల్లు..?
X

దేశం పేరు మారనుందా? ఇంగ్లీషులో ఇండియా నుంచి భారత్గా మార్చనున్నారా? ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రం భావిస్తోందా? జీ 20 సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చే విందు ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా ముద్రించడంపై ఈ ప్రశ్నలకు కారణమైంది. తాజా రాజకీయ పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి.





రాష్ట్రపతి ముర్ము విందు ఇన్విటేషన్ తో పాటు జీ 20 సదస్సు కోసం రూపొందించిన బుక్ లెట్ లోనూ దేశం పేరు భారత్ అని రాశారు. ‘భారత్‌, మదర్‌ ఆఫ్‌ డెమోక్రసీ’ అని అందులో రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశం పేరు మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆంగ్లంలోనూ ‘ఇండియా’ నుంచి ‘భారత్‌’గా పేరు మారుస్తూ ప్రధాని మోడీ సర్కారు ప్రత్యేక తీర్మానం తీసుకురానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో ‘ఇండియా: దటీజ్‌ భారత్‌’ అని ఉండగా.. ఇకపై ‘భారత్‌’ అనే పేరు మాత్రమే ఉండేలా సవరణ చేయనున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22 మధ్య ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ సెషన్లో ఇండియా పేరు మార్పు ఈ ప్రతిపాదనలు తీసుకురానున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.




Updated : 5 Sept 2023 4:06 PM IST
Tags:    
Next Story
Share it
Top