Home > జాతీయం > రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి ఉచిత వైద్యం.. వచ్చే 3 నెలల్లో..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి ఉచిత వైద్యం.. వచ్చే 3 నెలల్లో..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి ఉచిత వైద్యం.. వచ్చే 3 నెలల్లో..
X

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారికి ఉచిత వైద్యం అందేలా నూతన విధానంపై కసరత్తు చేస్తోంది. మరో మూడు నెలల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తోంది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ఈ విషయం తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించడమే దీన్ని ఉద్దేశమని అనురాగ్ జైన్ తెలిపారు.

‘‘ప్రమాదంలో గాయపడిన బాధితులకు ఉచిత వైద్యం అందించడం మోటారు వెహికల్ చట్టం 2019లో ఉంది. కొన్ని రాష్ట్రాలు దీనిని ఇప్పటికే అమలు చేశాయి. అయితే ప్రస్తుతం కేంద్రం ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. వచ్చే మూడు, నాలుగు నెలల్లో దీనిని అమలు చేస్తాం. గోల్డెన్‌ అవర్‌తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేస్తాం’’ అని అనురాగ్ జైన్ చెప్పారు.


Updated : 5 Dec 2023 2:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top