Home > జాతీయం > పబ్లిసిటీ కోసం రూ. 3,000 కోట్లు ఖర్చు చేసిన మోడీ సర్కార్

పబ్లిసిటీ కోసం రూ. 3,000 కోట్లు ఖర్చు చేసిన మోడీ సర్కార్

సెల్ఫ్ ప్రమోషన్ కోసం ఇన్ని రూ.కోట్లా..?

పబ్లిసిటీ కోసం రూ. 3,000 కోట్లు ఖర్చు చేసిన మోడీ సర్కార్
X


కేంద్ర ప్రభుత్వం 2018-19 నుంచి పబ్లిసిటీ కోసం రూ. 3,064.42 కోట్లను ఖర్చు పెట్టింది. ఇందులో ప్రింట్ మీడియా లిస్ట్ టాప్ ప్లేస్ లో ఉన్నది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ రాజ్యసభకు గత వారం అందించిన వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. 2018-19 నుంచి 2023-24 (జులై 13వ తేదీ వరకు) మధ్యకాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రింట్ మీడియాలో ప్రచారం కోసం రూ. 1,338.56 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం కోసం రూ. 1,273.06 కోట్లు, ఔట్ డోర్ పబ్లిసిటీ కోసం రూ. 452.80 కోట్లు ఖర్చు పెట్టింది. మొత్తంగా చూసుకుంటే 2018-19లో రూ 1,179.16 కోట్లు ఖర్చు పెట్టగా.. అదే 2022-23 మధ్య కాలంలో రూ. 408.46 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే.. ప్రచార ఖర్చు కాస్త తగ్గింది.

2019-20లో ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం 708.18 కోట్లు ఖర్చు పెట్టింది. 2020-21లో ఈ ఖర్చు రూ. 409.47 కోట్లకు తగ్గింది. 2021-22లో రూ. 315.98 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ 2022-23లో ఈ ఖర్చు మళ్లీ పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జులై మధ్య కాలంలో కేంద్రం రూ. 43.16 కోట్లు అడ్వర్టయిజ్‌మెంట్ కోసం ఖర్చు పెట్టింది. గత వారం కేంద్ర ప్రభుత్వం ఈ గణాంకాలను వెల్లడించింది. ప్రింట్ మీడియా కంటే 2018-19 మరియు 2019-20 సంవత్సరాల్లో ఎలక్ట్రానిక్ మీడియాకు అడ్వర్టైజ్‌మెంట్ పై ఎక్కువ వాటా ఉందని ఈ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఆ తరువాతి మూడు ఆర్థిక సంవత్సరాలలో ఈ ఖర్చు తగ్గింది.





2018-19లో ప్రింట్ మీడియాలో ప్రకటనల కోసం రూ.429.55 కోట్లు ఖర్చు పెట్టగా.. ఎలక్ట్రానిక్ మీడియాలో రూ.514.29 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రకటనల బడ్జెట్ గణనీయంగా తగ్గించబడినప్పటికీ.. ఆ తర్వాతి ఏడాది కూడా పబ్లిసిటీ కోసం ఎలక్ట్రానిక్ మీడియాకు రూ. 316.99 కోట్లు.. ప్రింట్ మీడియాకు రూ. 295.05 కోట్లు ఖర్చు చేశారు


Updated : 24 July 2023 7:46 AM IST
Tags:    
Next Story
Share it
Top