Home > జాతీయం > MODI : ఈ రూట్లలో.. ఇండో- బంగ్లా మధ్య రైల్వే లైన్

MODI : ఈ రూట్లలో.. ఇండో- బంగ్లా మధ్య రైల్వే లైన్

MODI : ఈ రూట్లలో.. ఇండో- బంగ్లా మధ్య రైల్వే లైన్
X

భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా పీఎం షేక్ హసీనా.. బుధవారం (నవంబర్ 1) వర్చువల్​గా ప్రాజెక్టులను ప్రారంభించారు. ఖుల్నా–మోంగ్లా పోర్ట్ రైల్వే లేన్, త్రిపురలోని అగర్తల–బంగ్లాదేశ్​ బార్డర్​లోని అఖౌరా క్రాస్ బార్డర్ రైల్వే లింక్, ఆ దేశంలోని రాంపాల్​లో మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్​రెండో యూనిట్లను ఈ సందర్భంగా ప్రారంభించారు. కాగా బంగ్లా కడుతున్న ఈ మూడు ప్రాజెక్టులకు భారత్ సాయం చేస్తుంది. క్రాస్ బార్డర్ రైల్వే ప్రాజెక్ట్ ద్వారా ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గంగా సాగర్ రైల్వే స్టేషన్ నుంచి నిశ్చింతపూర్ స్టేషన్ వరకు ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తయింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఇదో చారిత్రక ఘట్టం అని అన్నారు. ఈశాన్య భారత్, బంగ్లాదేశ్ ల మధ్య చేపట్టిన మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం అని అన్నారు. బంగ్లా అభివృద్ధికి సాయం అందించడం గర్వకారణం అని చెప్పుకొచ్చారు.




Updated : 2 Nov 2023 11:48 AM IST
Tags:    
Next Story
Share it
Top