Home > జాతీయం > లాస్ట్ బాల్ సిక్స్ కొట్టినట్లు.. విపక్షాలపై పైచేయి సాధించాలి

లాస్ట్ బాల్ సిక్స్ కొట్టినట్లు.. విపక్షాలపై పైచేయి సాధించాలి

లాస్ట్ బాల్ సిక్స్ కొట్టినట్లు.. విపక్షాలపై పైచేయి సాధించాలి
X

లోక్ సభ అవిశ్వాస తీర్మానానికి ముందు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ అగ్రనేతలంతా హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన మోదీ.. ప్రతిపక్షాలది ఇండియా కూటమి కాదని, అహంకార కూటమని మండిపడ్డారు. అహంకారుల కూటమిని ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు క్విట్ ఇండియా అని అన్నారు.

విపక్ష కూటమిలోని అవిశ్వాసాన్ని కప్పిపుచ్చుకునేందుకే అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారని విరుచుకుపడ్డారు. క్రికెట్ లో లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించినట్లు విపక్షాలపై పైచేయి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ తీర్మానం ప్రతిపక్షాల ఐక్యతకు, వాళ్ల అంతర్గత పరీక్ష అని అన్నారు. కాగా, ప్రస్తుతం పార్లమెంట్‌ వేదికగా అధికార విపక్షాల మధ్య చర్చ జోరుగా సాగుతోంది.



Updated : 8 Aug 2023 2:05 PM IST
Tags:    
Next Story
Share it
Top