Home > జాతీయం > Modi : గగన్యాన్ వ్యోమగాములను ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ

Modi : గగన్యాన్ వ్యోమగాములను ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ

Modi : గగన్యాన్ వ్యోమగాములను ప్రపంచానికి పరిచయం చేసిన మోదీ
X

గగన్ యాన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఇస్రో వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక మిషన్ కు ఎంపికైన వ్యోమగాములను.. మంగళవారం ప్రధాని మోదీ దేశానికి పరిచయం చేశారు. ఇస్రో కీర్తిని ప్రపంచానికి చాటే ఆ వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో గగన్ యాన్ మానవ యాత్ర చేసే వ్యోమగాముల వివరాలను పంచుకున్నారు. గ్రూప్ కెప్టెన్ ప్ర‌శాంత్ బాల‌కృష్ణ నాయ‌ర్‌, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణ‌న‌న్‌, గ్రూప్ కెప్టెన్ అంగ‌ద్ ప్ర‌తాప్‌, వింగ్ క‌మాండ‌ర్ శుభాన్షు శుక్ల పేర్ల‌ను మోదీ ప్ర‌క‌టించారు. ఆ న‌లుగురికీ మోదీ ఆస్ట్రోనాట్ వింగ్స్‌ను అందించారు. వింగ్స్ బ్యాడీల‌ను ప్ర‌జెంట్ చేశారు.

Updated : 27 Feb 2024 6:38 PM IST
Tags:    
Next Story
Share it
Top