Home > జాతీయం > అత్యుత్తమ ప్రధానిగా మోదీ

అత్యుత్తమ ప్రధానిగా మోదీ

అత్యుత్తమ ప్రధానిగా మోదీ
X

దేశంలోనే అత్యుత్తమ ప్రధానిగా నెంబర్ వన్ స్థానంలో నిలిచారు ప్రధాని నరేంద్ర మోదీ. మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో 44 శాతం ప్రజాదరణతో మోదీ అగ్రస్థానం సాధించారు. దేశంలోనే ఎక్కువ పాపులారిటీ ఉంది ప్రధానికి అన్న విషయం తేల్చి చెప్పింది. అన్ని లోక్ సభ స్థానాల నుంచి మొత్తం 35,801 మందిని సర్వే చేశామని ఆ సంస్థ తెలిపింది. ఇందులో 15 శాతంతో వాజ్‌పేయీ రెండో స్థానంలో ఉన్నారు. కాగా 14శాతంతో ఇందిరా గాంధీ మూడో స్థానంలోనూ..11 శాతంతో మన్మోహన్‌ సింగ్‌ నాలుగో స్థానంలో నిలిచారని చెప్పింది.

ఇక దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల లిస్ట్ లో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ముందున్నారు. ఆయన తర్వాత ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రెండో స్థానాన్ని చేజిక్కించుకున్నారు. నవీన్‌ పట్నాయక్‌కు 52.7 శాతం ప్రజాదరణ ఉండగా...యోగి ఆదిత్యనాథ్‌కు 51.3 శాతం ఆదరణ ఉంది. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ 48.6 శాతం ప్రజాదరణతో మూడో స్థానంలో ఉన్నారు. 42.6 శాతంతో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ నాలుగో స్థానంలో నిలవగా.. త్రిపుర సీఎం మాణిక్‌ సాహా 41.4 శాతం ప్రజాదరణతో ఐదో స్థానం దక్కించుకున్నారు. ఆయన తర్వాత పది స్థానాల వరకు వరుసగా..గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, ఎనిమిదో స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు.

Updated : 19 Feb 2024 9:47 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top