తెలంగాణలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.13,545 కోట్లతో..: ప్రధాని మోదీ
X
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. మహబూబ్ నగర్ లో పర్యటించిన మోదీ ‘ప్రజా గర్జణ సభలో’ ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధికి తోర్పడే.. పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.13,545 కోట్లతో అభివృద్ధి పనులకు వర్చువల్ గా శ్రీకారం చుట్టారు. దేశంలో పండుగల సీజన్ నడుస్తున్న క్రమంలో.. ఇటీవలే నారీ శక్తివందన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించారు. తాజాగా జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. పండుగల వేళ ఈ ప్రాజెక్టుల ద్వారా చాలామందికి ఉపాధి దక్కనుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణా సదుపాయం మెరుగవనుంది.
రూ.13,545 కోట్లతో ప్రధాని మోదీ మహబూబ్ నగర్ లో ప్రారంభించిన అభివృద్ధి పనులు:
* వరంగల్- ఖమ్మం -విజయవాడ హైవే పనులకు వర్చువల్ గా శంకుస్థాపన (ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లా ప్రజలకు ఉపాధి)
* రూ.1932 కోట్లతో కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీపర్పస్ ప్రొడక్ట్ పైప్ లైన్ ప్రారంభం
* రూ. 2457 కోట్లతో సూర్యాపేట- ఖమ్మం హైవే ప్రారంభం
* మునీరాబాద్- మహబూబ్ నగర్ క్లేర్ కృష్ణ లైన్ జాతికి అంకితం
* కాచిగూడ-రాయచూర్ - కాచిగూడ డెమో సర్వీస్ ప్రారంభం
* హసన్-చర్లపల్లి హెచ్పీసీఎల్ ఎల్పీజీ పైప్ లైన్ జాతికి అంకితం
* హన్మకొండలో టెక్స్టైల్ పార్క్ (వరంగల్ ప్రజలకు ఉపాధి)