దేశాన్ని రెండుగా చీల్చడానికి కాంగ్రెస్ కంకణం కట్టుకుంది: PM Modi
X
కాంగ్రెస్ వన్నీ పనికిరానీ ఆలోచనలేనని ప్రధానీ నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. బుధవారం (ఫిబ్రవరి 7) రాజ్యసభలో ప్రసంగించిన మోదీ.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చించారు. రాష్ట్రపతి ప్రసంగంపై కొందరు అభిప్రాయాలు చెప్తే.. మరికొందరు విమర్శించారని అన్నారు. గతంలో తన ప్రసంగాన్ని కూడా విపక్షాలు అడ్డుకున్నాయని గుర్తుచేశారు. విపక్షాలు తన మాటలు వినేందుకు సిద్ధంగా లేరని, విపక్షాల ఈ దుస్థితికి కాంగ్రెస్ పార్టీ కారణమని మోదీ విమర్శించారు. పార్లమెంటులో ఉన్నంతకాలం ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించాలని, లేదంటే పదవి పొందినందుకు అర్థం లేదని ఫైర్ అయ్యారు. ఉత్తరం, దక్షిణం పేరుతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విడదీయాలని చూడటం సరికాదని మోదీ సూచించారు. అది దేశానికి తీరని నష్టం చేకూరుస్తుందని అన్నారు.
నెహ్రూ ముమ్మాటికీ రిజర్వేషన్లకు వ్యతిరేకి. ఈ విషయాన్ని తెలుపుతూ.. అప్పటి సీఎంలకు నెహ్రూ లేఖ కూడా రాశారు. అది ఇప్పటికీ రికార్డుల్లో ఉంది. దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తే.. ఉద్యోగాల్లో నైపుణ్యత దెబ్బతింటుందని నెహ్రూ చెప్పారు. ఆ టైంలో అంబేద్కర్ లేకపోతే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చేవి కావు. ఇంతచేసిన అంబేద్కర్ కు కాంగ్రెస్ పార్టీ కావాలనే భారతరత్న ఇవ్వలేదు. దళితులు, ఆదివాసీల అభ్యున్నతే బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యత. అందుకే ఏకలవ్య లాంటి స్కూళ్లను కట్టించాం. పదేళ్ల క్రితం 120 ఏకలవ్య స్కూళ్లు మాత్రమే ఉండేవి. బీజేపీ ప్రభుత్వ ఏర్పడ్డ తర్వాత 400కు పైగా ఏకలవ్య స్కూళ్లను ఏర్పాటుచేశామని మోదీ చెప్పుకొచ్చారు.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్.. ఇదే మోదీ గ్యారంటీ అని రాజ్యసభ సాక్షిగా మోదీ స్పష్టం చేశారు. నవ భారత నిర్మాణానికి ఇదే నాంది. నిరాశావాదాన్ని దేశ వ్యాప్తంగా వ్యాపింపజేయడమే కాంగ్రెస్ అజెండా అని మోదీ దుయ్యబట్టారు. ఇన్నాళ్లు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసినట్లు బీజేపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. BSNL,MTNL, HAL, AIR INDIA లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే. బీజేపీ ప్రభుత్వ హయాంలో BSNL పటిష్టం చేసి 5జీ నెట్వర్క్ ను తీసుకొచ్చినట్లు మోదీ స్పష్టం చేశారు. HAL కూడా లాభాల్లో నడుస్తుందని అన్నారు. LIC మూత పడుతుందని కాంగ్రెస్ పుకార్లు పుట్టిస్తుంది. అది అసత్యమని ఇప్పుడు LIC షేర్ల ధర రికార్డు స్థాయికి చేరిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ పదేళ్లలో ప్రభుత్వ రంగ ఆస్తులను రూ.9లక్షల కోట్ల నుంచి రూ. 75 లక్షల కోట్లకు పెంచినట్లు మోదీ స్పష్టం చేశారు.