Home > జాతీయం > MODI : నేడు అబుధాబిలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్న మోదీ

MODI : నేడు అబుధాబిలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్న మోదీ

MODI : నేడు అబుధాబిలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్న మోదీ
X

దుబాయ్ ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు ఇసుకతో ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం..ఇప్పుడు ఎంతో మందిని ఆకర్షిస్తుంది. అద్భుతమైన టెక్నాలజీ, డెవలప్మెంట్ తో అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అయితే ఇవాళ అబుదాబిలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. అబుధాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఈ మేరకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. అందుకోసం ప్రధాని మోదీ మంగళవారం రాజధాని నగరమైన అబుధాబికి చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఆ దేశాధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ స్వయంగా మోదీకి ఘన స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్నారు.

అరబ్బుల నేలపై అద్భుతమైన హిందూ దేవాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ సిద్దమైయ్యారు. అబుధాబిలో స్వామి నారాయణ్ మందిరాన్ని అద్భుతంగా నిర్మించారు. ఈ దేవాలయానికి అక్కడి ప్రభుత్వం 27 ఎకరాలను కేటాయించింది. కాగా ఆలయ నిర్మాణంలో 20 వేల టన్నుల పాలరాయిని ఉపయోగించారు. భారత పురాతన సంసృతిని తలపించేలా దేవాలయ నిర్మాణాన్ని చేపట్టారు అధికారులు. అబుధాబిలో ఇది తొలి హిందూ దేవాలయం కావడం విశేషం.


Updated : 14 Feb 2024 3:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top