MODI : అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్క్‌లో.. ఏనుగుపై మోదీ సవారీ
X
ప్రధాని మోదీ అస్సాంలో పర్యటిస్తున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ నేషనల్ పార్క్ ను ఆయన సందర్శించారు. అక్కడి సిబ్బందితో కలిసి ఏనుగు పై సఫారీ చేశారు. అస్సాంలో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో నిన్న మోదీ తేజ్‌పుర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గోలాఘాట్ లోని కజిరంగకు వచ్చారు. నేషనల్ పార్క్ లోనే రెస్ట్ తీసుకొని తెల్లవారుజామున అడవిలోని సెంట్రల్ కొహోరా రేంజ్‌కు వెళ్లారు. ముందుగా ఏనుగుపైకి ఎక్కి తిరిగిన ప్రధాని.. ఆ తర్వాత జీపులో సఫారీ చేశారు. పార్క్ లోని ప్రకృతి అందాలను, జంతువుల ఫొటోలను తన కెమెరాలో బంధించారు. సఫారీ అనంతరం ఏనుగులకు చెరకు గడలను తినిపించారు. ఫారెస్ట్ గార్డ్ లతో సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ కజిరంగ నేషనల్ పార్క్‌ను సందర్శించాలని కోరారు. అయితే 1957 తర్వాత ఈ పార్క్‌ను సందర్శించిన తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.