Home > జాతీయం > సీఎం సంచలన నిర్ణయం..మహిళలను వేధిస్తే ప్రభుత్వ ఉద్యోగానికి దూరం

సీఎం సంచలన నిర్ణయం..మహిళలను వేధిస్తే ప్రభుత్వ ఉద్యోగానికి దూరం

సీఎం సంచలన నిర్ణయం..మహిళలను వేధిస్తే ప్రభుత్వ ఉద్యోగానికి దూరం
X

నేటి సమాజంలో ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికఠిన చట్టాలు తీసుకొచ్చిన పరిస్థితులు మారడం లేదు. నిత్యం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో దుర్మార్గులు చేతిలో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డుపై, బస్సులో, పనిచేసే అఫీసుల్లో కామాంధులు కాటేస్తున్నారు. రోజురోజుకు బాలికలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మహిళలను వేధించేవారు ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హులని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడితే వారి క్యారెక్టర్ సర్టిఫికెట్‌పై వారు చేసిన పనులను రాస్తారని తెలిపారు. తద్వారా వారికి భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఉపాధి లభించదని గెహ్లాట్ ట్వీట్ చేశారు.

‘‘బాలికలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే నిందితులు, దుర్మార్గులను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం హిస్టరీ-షీటర్ల వంటి పోలీస్ స్టేషన్లలో వేధింపులకు పాల్పడిన వారి రికార్డు నమోదు చేయబడుతుంది. ఈ వ్యక్తులు వేధింపుల సంఘటనలలో పాల్గొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం/పోలీసులు జారీ చేసిన వారి క్యారెక్టర్ సర్టిఫికేట్‌లో పేర్కొంటారు. ఇలాంటి సంఘ వ్యతిరేకులను సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది’’ అని ముఖ్యమంత్రి ట్విట్టర్ లో రాసుకొచ్చారు.


Updated : 8 Aug 2023 9:26 PM IST
Tags:    
Next Story
Share it
Top