Home > జాతీయం > వృద్ధుడిపై కోతి రివేంజ్.. పక్కా ప్లాన్తో..

వృద్ధుడిపై కోతి రివేంజ్.. పక్కా ప్లాన్తో..

వృద్ధుడిపై కోతి రివేంజ్.. పక్కా ప్లాన్తో..
X

అడవులను నరికి ప్లాట్లు, వ్యవసాయ భూములుగా మలుస్తుంటా.. అక్కడ ఆహారం దొరకని కోతులు ఊళ్లోకి చేరి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయి. కోతుల దాడిలో గాయపడ్డారన్న వార్తలు తరచూ చూస్తుంటాం. అయితే ఓ కోతి కాస్త తెగించింది. పక్కా ప్లాన్ చేసి.. తనను రోజూ బెదరగొడుతున్న ముసలాయనపై రివేంజ్ తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తర్ ప్రదేశ్ లోని మథుర జిల్లా గౌఘట్ కాశ్మీరీలో ఈ ఘటన జరిగింది. అన్ని చోట్లా ఉన్నట్లు ఆ గ్రామలో కూడా కోతుల బెడద విపరీతంగా ఉంది. గుంపులు గుంపులుగా తిరుగుతున్న కోతులు.. ప్రతిరోజు ఇళ్లల్లోకి చేరి గంధరగోళం చేస్తున్నాయి. పంట పొలాలు, తోటలను నాశనం చేస్తున్నాయి.





రోడ్డు వెళ్లేవాళ్లపై దాడులకు పాల్పడుతున్నాయి. తన ఇంటిపైకి వచ్చిన కోతుల్ని హంగామా చేస్తున్న కోతుల్ని ఓ వృద్ధుడు (65) బెదరగొట్టేవాడు. అలా ఓ రోజు తన ఇంటి మేడపై ఉండగా ఓ కోతులు గుంపు కాలనీలో ప్రవేశించింది. దాంతో వాటిని బెదగొట్టే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఓ కోతి వచ్చి అతన్ని వెనకనుంచి తోసేసింది. దాంతో ఆ వృద్ధుడు మేడపై నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలైన అతన్ని కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోతులు ఇంత రచ్చ చేస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవట్లేదని, వాటి బెడద నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు. కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని అధికారులని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







Updated : 12 Aug 2023 1:04 PM GMT
Tags:    
Next Story
Share it
Top