Home > జాతీయం > Delhi Metro : పోటెత్తిన జనం..ఒక్కరోజే 71 లక్షలమందికిపైగా ప్రయాణం!

Delhi Metro : పోటెత్తిన జనం..ఒక్కరోజే 71 లక్షలమందికిపైగా ప్రయాణం!

Delhi Metro : పోటెత్తిన జనం..ఒక్కరోజే 71 లక్షలమందికిపైగా ప్రయాణం!
X

(Metro Record) ఢిల్లీ నగరంలో ఒక్కరోజే 71 లక్షల మందికి పైగా ప్రయాణం చేశారు. ఢిల్లీలో ప్రయాణించేందుకు మెట్రో రైళ్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చల్లటి ఏసీలో తక్కువ సమయంలోనే అనుకున్న గమ్యానికి చేరవచ్చు. అందుకే రోజు రోజుకూ మెట్రో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. తాజాగా బుధవారం ఒక్కరోజే 71 లక్షల మందికి పైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించారు. దీంతో మెట్రో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

ఢిల్లీ మెట్రో చరిత్రలోనే 71.09 లక్షల మంది తొలిసారి ప్రయాణించారు. ఈ విషయాన్ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది. సోషల్ మీడియా వేదికగా మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ విషయాన్ని తెలిపింది. అయితే ఢిల్లీ సరిహద్దులో ఇప్పుడు రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల నిరసనల వల్ల ఢిల్లీతో పాటుగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

రోడ్లపై ప్రయాణించాలంటే రోజుల తరబడీ వేచి ఉండాల్సి వస్తోంది. అందుకే ఢిల్లీ ప్రజలు ఇప్పుడు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. మంగళవారం నుంచి ఢిల్లీలో చలో మెగా మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో నగరంలోని 9 మెట్రో స్టేషన్లను అధికారులు కొన్ని గంటల పాటు మూసివేశారు. ఆ స్టేషన్లను కూడా తెరిచి ఉంటే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగి ఉండేదని మెట్రో అధికారులు చెబుతున్నారు.

Updated : 15 Feb 2024 7:04 AM IST
Tags:    
Next Story
Share it
Top