Home > జాతీయం > కోతిపై 21వేల రివార్డ్.. ఎట్టకేలకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ మంకీ

కోతిపై 21వేల రివార్డ్.. ఎట్టకేలకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ మంకీ

కోతిపై 21వేల రివార్డ్.. ఎట్టకేలకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ మంకీ
X

ఈ మధ్య కోతులు ఇళ్లల్లోకి వస్తుండడం కామన్ అయ్యింది. అడువులను వదిలి గ్రామాలను ఆవాసాలుగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మనుషులపై దాడులకు పాల్పడుతుండడం కలకలం రేపుతోంది. ఓ కోతి ఏకంగా 20మందిపై దాడి చేసి అక్కడి ప్రజల్ని హడలెత్తించింది. అటవీ అధికారులకు కూడా దొరకకుండా చుక్కలు చూపించింది. దాన్ని పట్టుకున్నళ్లకు 21వేల రివార్డు ప్రకటించారు. ఎట్టకేలకు దానిని పట్టుకోవడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు.

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో ఓ కోతి బీభత్సం సృష్టించింది. రెండు వారాల్లో 20మందిపై దాడి చేసింది. వారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. ఇంటి పైకప్పులు, కిటికీల గుమ్మాలపై కూర్చుని, అకస్మాత్తుగా జనాలపై దాడి చేస్తోందని అధికారులు తెలిపారు. దీంతో కోతిని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. అయితే దొరకకపోవడంతో.. దానిని పట్టుకున్న వాళ్లకు 21వేల రివార్డు ప్రకటించారు.

ఈ క్రమంలో కోతిని పట్టుకోడానికి ఉజ్జయిని నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రప్పించారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం స్థానికులతో కలిసి డ్రోన్ల సాయంతో కోతిని గుర్తించి బంధించారు. దీంతో స్థానిక ప్రజలు పీడ వదిలింది అనుకున్నారు. అధికారులు ఆ కోతిని తీసుకెళ్తుంటే స్థానికులు జై శ్రీరాం,జై బజరంగ్ బలి నినాదాలు చేశారు.

‘‘ఆ కోతిని పట్టుకోవడం మా వల్ల కాలేదు. మేం జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాం. ఆయన సహాకారంతో ఉజ్జయిని నుంచి అటవీ శాఖ రెస్క్యూ టీమ్‌ను పిలిపించాం.. మున్సిపాలిటీ సిబ్బంది.. స్థానికులు వారికి సాయం చేశారు. కోతిని పట్టుకోవడానికి 4 గంటల సమయం పట్టింది. కోతిపై ప్రకటించిన రివార్డును రెస్క్యూ టీంకు అందజేస్తాం’’ అని రాజ్‌గఢ్ మున్సిపల్ చైర్మన్ వినోద్ సాహు తెలిపారు.

Updated : 22 Jun 2023 3:18 PM IST
Tags:    
Next Story
Share it
Top