Viral Video: మొసలి పక్కన పిల్లలను నించోబెట్టిన పేరెంట్స్.. ఎందుకంటే
X
ఏదైనా కాస్త విచిత్రంగా కనిపిస్తే చాలు.. వెంటనే జేబులో ఉన్న ఫోన్ తీసి ఫోటోలు, వీడియోలు తీసి, వాటి సోషల్ మీడియాలో షేర్ చేయడం చాలామందికి కామన్ అయిపోయింది. మిడిల్ ఏజ్‌డ్ పీపుల్ కూడా ఇందుక మినహాయింపు కాదు. వ్యూస్, లైక్స్ మోజులో పడి, సర్వం మరిచిపోయి రిస్క్ చేయడానికైనా వెనుకాడడం లేదు. అయితే ఆ రిస్క్‌లో తమ పిల్లలను కూడా భాగం చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మీరు షాక్ అవ్వక తప్పదు. మీరేం తల్లిదండ్రులు అని చీధరించుకుంటారు కూడా.
వైరల్ అవుతున్న ఆ వీడియోలోని పెద్దలు తమ పిల్లలను.. క్రూరమైన ఓ భారీ సరీసృపం ముందు నించుబెట్టి ఫోటోలు ,వీడియోలు తీశారు. @ramprasad అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి రోడ్డుపై వెళ్తున్నారు. రోడ్డు పక్కన వారికి ఓ మొసలి చలనం లేకుండా నోరు తెరుచుకొని ఉండడం కనిపించింది. ఇక ఆలస్యం చేయకుండానే వెంటనే తమ పిల్లలను బలవంతంగా ఆ మొసలి ముందు నిల్చోపెట్టి ఫొటోలు తీశారు. ఆ పిల్లలు భయపడుతున్నా, పెద్దలు వారిని ఒత్తిడి చేసి ఫొటోలు తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోలోని పేరెంట్స్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగా మూర్ఖత్వం అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
What explains this behavior by desi parents? pic.twitter.com/Jgm32R87jN
— Ram (@ramprasad_c) January 8, 2024