Home > జాతీయం > Mount Everest: ఎవరెస్ట్ పర్వతారోహులకు కొత్త నిబంధన.. ఏంటంటే..

Mount Everest: ఎవరెస్ట్ పర్వతారోహులకు కొత్త నిబంధన.. ఏంటంటే..

Mount Everest: ఎవరెస్ట్ పర్వతారోహులకు కొత్త నిబంధన.. ఏంటంటే..
X

ఎవరెస్ట్‌ పర్వతాన్ని ఎక్కాలనుకునే వారికి కాస్త ఇబ్బంది కలిగించే వార్త ఇది. ఇకపై ఎవరెస్టును అధిరోహించే వారెవరైనా సరే.. వెంట ఓ ప్రత్యేక సంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకో తెలుసా..? ఆ సంచిలో.. మీరు పర్వతంపై విసర్జించిన మలాన్ని సేకరించాలి. అవును..వినటానికి కాస్త కంపుగా ఉన్నా.. పర్యావరణ, పర్వత పరిరక్షణ కోసం ఈ పనిని బాధ్యతగా స్వీకరించాల్సిందే. మీరు పర్వతంపై విసర్జించిన మీ మలాన్ని ఓ ప్రత్యేక సంచిలో నింపి.. ఆ సంచిని కింద ఉన్న బేస్‌ క్యాంప్‌కు తీసుకురావాలి. అలా కాకుండా ఖాళీ సంచితో వస్తే ఊరుకోమని చెప్పింది ఎవరెస్ట్‌ పర్వత్వానికి చెందిన నేపాల్‌లోని పసాంగ్ లాము గ్రామీణ మున్సిపాలిటీ.

ఆ మున్సిపాలిటీ చైర్మన్ మింగ్మా షెర్పా.... ఈ కొత్త నిబంధన గురించి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా పర్వతాలపై మల విసర్జన పూర్తిగా క్షీణించిందని చెప్పారు. దీంతో పర్వతాల్లో దుర్వాసన వస్తుందన్నారు. కొంత మంది పర్వతారోహకులు ఆ గాలి పీల్చడంతో అనారోగ్యానికి గురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఈ పరిస్థితి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్న ఆయన, తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఎవరెస్ట్‌ పర్వతాన్ని, పొరుగున ఉన్న మౌంట్ లోట్సేను అధిరోహించాలనుకునే వ్యక్తులు.. రసాయనాలతో కూడిన ప్రత్యేక మల సంచులను బేస్ క్యాంప్‌లో కొనుగోలు చేయాలని మింగ్మా షెర్పా తెలిపారు. వారు బేస్‌ క్యాంప్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆ మల సంచులను తనిఖీ చేస్తారని చెప్పారు. ఈ చర్య ద్వారా ఎవరెస్ట్‌ పర్వతాలపై మల విసర్జాలను నివారించి అక్కడి పర్యావరణాన్ని కాపాడుతామని ఆయన అన్నారు.


Updated : 8 Feb 2024 4:24 PM GMT
Tags:    
Next Story
Share it
Top